Neegela veṟabu ninnevva remani reeda

నీకేల వెఱపు నిన్నెవ్వ రేమని రీడ
Language

(॥పల్లవి॥)
నీకేల వెఱపు నిన్నెవ్వ రేమని రీడ
పోకలఁ బో కాపె నిట్టె బోగించరాదా

(॥నీకే॥)
అంగన మాటలాడితే నాయములు గరఁగేవు
చెఁగలించిచూచితేనే చెమరించేవు
ముంగిట నిలిచితేను ముంచి పులకించేవు
పొంగినాస నీ కాపెను బోగించరాదా

(॥నీకే॥)
కందువల నవ్వితేను గక్కన భ్రమసేవు
అంది కానుకలిచ్చితే సలసేవు
సందడి నీకు మొక్కితే సారె నుసురనేవు
పొందులు సేసు కీపెను బోగించరాదా

(॥నీకే॥)
వాపులు నీకుఁ జెప్పితే వలపులు రేఁగేవు
చేవట్టి తీసితేనె చిక్కువడేవు
శ్రీవేంకేటేశ్వరుఁడ చేరి నన్ను నేలితివి
బూవానఁ బెట్టుకాపెనుబోగించరాదా

(||pallavi||)
nīgela vĕṟabu ninnĕvva remani rīḍa
pogalam̐ bo kābĕ niṭṭĕ bogiṁcharādā

(||nīge||)
aṁgana māḍalāḍide nāyamulu garam̐gevu
sĕm̐galiṁchisūsidene sĕmariṁchevu
muṁgiḍa nilisidenu muṁchi pulagiṁchevu
pŏṁgināsa nī kābĕnu bogiṁcharādā

(||nīge||)
kaṁduvala navvidenu gakkana bhramasevu
aṁdi kānugalichchide salasevu
saṁdaḍi nīgu mŏkkide sārĕ nusuranevu
pŏṁdulu sesu kībĕnu bogiṁcharādā

(||nīge||)
vābulu nīgum̐ jĕppide valabulu rem̐gevu
sevaṭṭi tīsidenĕ sikkuvaḍevu
śhrīveṁkeḍeśhvarum̐ḍa seri nannu nelidivi
būvānam̐ bĕṭṭugābĕnubogiṁcharādā