Neegela verabu nelamtagidi sammade

నీకేల వెరపు నెలఁతకిది సమ్మతే
Language

(॥పల్లవి॥)
నీకేల వెరపు నెలఁతకిది సమ్మతే
చేకొన్న నీ యిచ్చలను చెందఁగరాదా

(॥॥)
సిగ్గువడి వుంటేనేమి చెయివట్టి తియ్యరాదా
యెగ్గులు తప్పులు నాపె యెంచీనా
అగ్గలపు వలపులు ఆసల విడిచుండునా
బగ్గనఁ బువ్వు తొడమెఁ బాసి వుండునా

(॥॥)
నవ్వుతా నుంటేనేమి నలి గాఁగిలించరాదా
రవ్వలుసేసి బీరము చూపీనా
మవ్వపు జవ్వనమది మదము విడిచుండునా
దివ్వెవెలుఁగు చీఁకటిఁ దెగి పాసి వుండునా

(॥॥)
గుట్టుతో నుంటేనేమి కూచుండఁ బెట్టుకోరాదా
యెట్టైనా నలమేల్మంగ యెదురాడీనా
నెట్టన శ్రీవేంకటేశ నిన్నుఁ గూడి వున్నదీకె
వొట్టిన కొండలు రాళ్ళనొగిఁ బాసి వుండునా

(||pallavi||)
nīgela vĕrabu nĕlam̐tagidi sammade
segŏnna nī yichchalanu sĕṁdam̐garādā

(||||)
sigguvaḍi vuṁṭenemi sĕyivaṭṭi tiyyarādā
yĕggulu tappulu nābĕ yĕṁchīnā
aggalabu valabulu āsala viḍisuṁḍunā
bagganam̐ buvvu tŏḍamĕm̐ bāsi vuṁḍunā

(||||)
navvudā nuṁṭenemi nali gām̐giliṁcharādā
ravvalusesi bīramu sūbīnā
mavvabu javvanamadi madamu viḍisuṁḍunā
divvĕvĕlum̐gu sīm̐kaḍim̐ dĕgi pāsi vuṁḍunā

(||||)
guṭṭudo nuṁṭenemi kūsuṁḍam̐ bĕṭṭugorādā
yĕṭṭainā nalamelmaṁga yĕdurāḍīnā
nĕṭṭana śhrīveṁkaḍeśha ninnum̐ gūḍi vunnadīgĕ
vŏṭṭina kŏṁḍalu rāḽḽanŏgim̐ bāsi vuṁḍunā