Neegela talavamcha ninnu doorenaa nenu

నీకేల తలవంచ నిన్ను దూరేనా నేను
Language

(॥పల్లవి॥)
నీకేల తలవంచ నిన్ను దూరేనా నేను
లోకములో సుద్దులకు లోనయ్యేవాఁడవా

(॥నీకే॥)
కైవశమై నీవు నాకుఁ గలిగి మోహించఁగాను
ఆవలీవలిసతులు ఆసపడేరు
నీవేల కైకొందు వది నేరమి తమదే కాక
వేవేలకు నీపై నింద వేయఁగలరా

(॥నీకే॥)
మిక్కిలిమాయింటిలోనిమేడపై నీ వుండఁగాను
యెక్కడో చెలులు నిన్ను నెలయించేరు
అక్కర తమకె కాక అది వరాకా నీకు
తెక్కుల నీవోజ తాము తిప్పఁ గలరా

(॥నీకే॥)
గట్టిగా నాకాఁగిటనే కలసి నీ వుండఁగాను
వొట్టుక కొలువుకొంత లొలవేసేరు
నెట్టన శ్రీవేంకటేశ నీవు దమ్ముఁ జెనకేవా
మెట్టుకొని నిన్నంతేసి మెప్పించఁ గలరా

(||pallavi||)
nīgela talavaṁcha ninnu dūrenā nenu
logamulo suddulagu lonayyevām̐ḍavā

(||nīge||)
kaivaśhamai nīvu nāgum̐ galigi mohiṁcham̐gānu
āvalīvalisadulu āsabaḍeru
nīvela kaigŏṁdu vadi nerami tamade kāga
vevelagu nībai niṁda veyam̐galarā

(||nīge||)
mikkilimāyiṁṭilonimeḍabai nī vuṁḍam̐gānu
yĕkkaḍo sĕlulu ninnu nĕlayiṁcheru
akkara tamagĕ kāga adi varāgā nīgu
tĕkkula nīvoja tāmu tippam̐ galarā

(||nīge||)
gaṭṭigā nāgām̐giḍane kalasi nī vuṁḍam̐gānu
vŏṭṭuga kŏluvugŏṁta lŏlaveseru
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvu dammum̐ jĕnagevā
mĕṭṭugŏni ninnaṁtesi mĕppiṁcham̐ galarā