Neegela salamu nettugonna vibhudavu

నీకేల చలము నెట్టుకొన్న విభుడవు
Language

(॥పల్లవి॥)
నీకేల చలము నెట్టుకొన్న విభుడవు
ఆకెకుఁ జనవు లిచ్చి యాదరించరాదా

(॥నీకే॥)
పంతము లాడితే నేమి పట్టి పెనఁగితే నేమి
కాంతుఁడ నీపై బత్తిగలదానికి
చెంతఁ గొసరితే నేమి సిగ్గులు వడితే నేమి
సంతోసాన విఱవీఁగే జవ్వనపుదానికి

(॥నీకే॥)
సెలవి నవ్వితే నేమి చేతులు చాఁచితే నేమి
అలరి నిన్నుఁ జెనకేయట్టిదానికి
నిలుచుండితే నేమి నిన్నిట్టే చూచితే నేమి
తలకొని సేవసేసి తనియనిదానికి

(॥నీకే॥)
సంగడిఁ గూచుంటే నేమి చన్నుల నొత్తితే నేమి
అంగవించి నీకు దేవులై నదానికి
యెంగిలి మోవైతే నేమి యిట్టె శ్రీవేంకటేశ
సంగతై నిన్నుఁగూడినన సమరతిదానికి

(||pallavi||)
nīgela salamu nĕṭṭugŏnna vibhuḍavu
āgĕgum̐ janavu lichchi yādariṁcharādā

(||nīge||)
paṁtamu lāḍide nemi paṭṭi pĕnam̐gide nemi
kāṁtum̐ḍa nībai battigaladānigi
sĕṁtam̐ gŏsaride nemi siggulu vaḍide nemi
saṁtosāna viṟavīm̐ge javvanabudānigi

(||nīge||)
sĕlavi navvide nemi sedulu sām̐side nemi
alari ninnum̐ jĕnageyaṭṭidānigi
nilusuṁḍide nemi ninniṭṭe sūside nemi
talagŏni sevasesi taniyanidānigi

(||nīge||)
saṁgaḍim̐ gūsuṁṭe nemi sannula nŏttide nemi
aṁgaviṁchi nīgu devulai nadānigi
yĕṁgili movaide nemi yiṭṭĕ śhrīveṁkaḍeśha
saṁgadai ninnum̐gūḍinana samaradidānigi