నీకేల పొద్దు వోదు నేమెంత బాఁతి పడ్డాను
(॥పల్లవి॥)
నీకేల పొద్దు వోదు నేమెంత బాఁతి పడ్డాను
దాకొని యపుడు నీ చిత్తానఁ బట్టీనా
(॥॥)
పొరుగు పోరచి యాపె పొందులు నీకుఁ జేయఁగా
సరసము నేనాడితే సంగతయ్యీనా
తరవాతి పనులాపె తలపెట్టుకుండఁగాను
బెరసి మా పిలుపులు ప్రియమయ్యీనా
(॥॥)
మేడమీఁద నుండి యాకె మేకులు నీకుఁ జేయఁగా
వీడెము నేనిచ్చితేను వేడుకయ్యీనా
కూడేనంటా నిన్ను నిట్టే కోరి వేఁడి వుండఁగాను
యీడ నుండుమంటే నీకు నితవయ్యీనా
(॥॥)
తానే వచ్చి యాకె నీదగ్గరఁ గూచుండఁగాను
ఆనుకొని నే నవ్వితే నందమయ్యీనా
మానక శ్రీవేంకటేశ మమ్మిందరిఁ గూడితివి
యీ నిజము లిట్టేకాక ఇఁక వేరయ్యీనా
(||pallavi||)
nīgela pŏddu vodu nemĕṁta bām̐ti paḍḍānu
dāgŏni yabuḍu nī sittānam̐ baṭṭīnā
(||||)
pŏrugu porasi yābĕ pŏṁdulu nīgum̐ jeyam̐gā
sarasamu nenāḍide saṁgadayyīnā
taravādi panulābĕ talabĕṭṭuguṁḍam̐gānu
bĕrasi mā pilubulu priyamayyīnā
(||||)
meḍamīm̐da nuṁḍi yāgĕ megulu nīgum̐ jeyam̐gā
vīḍĕmu nenichchidenu veḍugayyīnā
kūḍenaṁṭā ninnu niṭṭe kori vem̐ḍi vuṁḍam̐gānu
yīḍa nuṁḍumaṁṭe nīgu nidavayyīnā
(||||)
tāne vachchi yāgĕ nīdaggaram̐ gūsuṁḍam̐gānu
ānugŏni ne navvide naṁdamayyīnā
mānaga śhrīveṁkaḍeśha mammiṁdarim̐ gūḍidivi
yī nijamu liṭṭegāga im̐ka verayyīnā