నీకేల కొంకను నిన్ను నాడేవారెవ్వరు
(॥పల్లవి॥)
నీకేల కొంకను నిన్ను నాడేవారెవ్వరు
దాకొని వొరసితేనే తల వంచేవు
(॥నీకేల॥)
కొనచూపులను నీకు గొచ్చి కొచ్చి మొక్కఁగాను
వనితతో నింతయేల వంతులాడేవు
ననుపున సెలవుల నవ్వు నీతో నవ్వఁగాను
వొనరి యంతేసి యాల వొడ్డుకొనేవు
(॥నీకేల॥)
సెలవుల నవ్వి నవ్వి చిత్తము గరఁగించఁగా
చెలియకు నింతేశాల సిగ్గు రేఁచేవు
మొలకచన్నుల నొత్తి ముద్దు నీకుఁ జూపఁగాను
తలపోసి నీ వేలింత తడఁబడేవు
(॥నీకేల॥)
కప్పురము మోవి నిచ్చి కాఁగిలించుకొనఁగాను
వుప్పతిల్లియేఁటి కసురుసురనేవు
యిప్పుడే శ్రీవేంకటేశ యిద్దరునుఁ గూడితిరి
చొప్పులెత్తి యింకనేల సోద్య మనేవు
(||pallavi||)
nīgela kŏṁkanu ninnu nāḍevārĕvvaru
dāgŏni vŏrasidene tala vaṁchevu
(||nīgela||)
kŏnasūbulanu nīgu gŏchchi kŏchchi mŏkkam̐gānu
vanidado niṁtayela vaṁtulāḍevu
nanubuna sĕlavula navvu nīdo navvam̐gānu
vŏnari yaṁtesi yāla vŏḍḍugŏnevu
(||nīgela||)
sĕlavula navvi navvi sittamu garam̐giṁcham̐gā
sĕliyagu niṁteśhāla siggu rem̐sevu
mŏlagasannula nŏtti muddu nīgum̐ jūbam̐gānu
talabosi nī veliṁta taḍam̐baḍevu
(||nīgela||)
kappuramu movi nichchi kām̐giliṁchugŏnam̐gānu
vuppadilliyem̐ṭi kasurusuranevu
yippuḍe śhrīveṁkaḍeśha yiddarunum̐ gūḍidiri
sŏppulĕtti yiṁkanela sodya manevu