నీకేల ఇంత వెరపు నేనుండఁగా
(॥పల్లవి॥)
నీకేల ఇంత వెరపు నేనుండఁగా
చేకొన నీకిచ్చకాలు సేయవద్దా నాకును
(॥॥)
పూని మా యింటికి రాను పొంచి సిగ్గువడేవు
దానికేమి యేమైనానుఁ దప్పుసేసితో
పోనీలే బలిమి నిన్నుఁ బొలఁతు లేమిసేసినాను
కానఁ బడ నొకతప్పు గానవద్దా నాకును
(॥॥)
మోముచూడ వెఱచేవు మెదలనే తలవంచి
యేమైనా మావారు నేరాలెంచెరా నిన్ను
భామ లెవ్వరైనా నిన్ను బతిమి చెరిచినాను
వేమారు నిన్ను వెనకవేసుకొక పోవునా
(॥॥)
మాఁటలాఁడఁ గొంకేవు మచ్చిక నిన్నిటు గూడి
తూఁటమోని గంటైతే దోసమా యేమి
నేఁటనే శ్రీ వేంకటేశ నీవే నన్నుఁ గూడితివి
నాఁటకీఁడవైన నిన్ను నమ్మవద్దా ఇపుడు
(||pallavi||)
nīgela iṁta vĕrabu nenuṁḍam̐gā
segŏna nīgichchagālu seyavaddā nāgunu
(||||)
pūni mā yiṁṭigi rānu pŏṁchi sigguvaḍevu
dānigemi yemainānum̐ dappusesido
ponīle balimi ninnum̐ bŏlam̐tu lemisesinānu
kānam̐ baḍa nŏgadappu gānavaddā nāgunu
(||||)
momusūḍa vĕṟasevu mĕdalane talavaṁchi
yemainā māvāru nerālĕṁchĕrā ninnu
bhāma lĕvvarainā ninnu badimi sĕrisinānu
vemāru ninnu vĕnagavesugŏga povunā
(||||)
mām̐ṭalām̐ḍam̐ gŏṁkevu machchiga ninniḍu gūḍi
tūm̐ṭamoni gaṁṭaide dosamā yemi
nem̐ṭane śhrī veṁkaḍeśha nīve nannum̐ gūḍidivi
nām̐ṭagīm̐ḍavaina ninnu nammavaddā ibuḍu