Neege telusunu nelamtabhaavamulu

నీకే తెలుసును నెలఁతభావములు
Language

(॥పల్లవి॥)
నీకే తెలుసును నెలఁతభావములు
యీకడఁ గలదియు నింతేమాట

(॥నీకే॥)
చెలువుఁడ నీపేరు చెవిలో నుడిగిన
చెలియకుఁ జెక్కులు చెమరించె
పులకలు కుచములఁ బొదలెను కమ్మర
నిలువునివ్వెరగు నిండెను మతిని

(॥నీకే॥)
కాంతకు నీరూపు కన్నులఁ జూపిన
వింతగునగవులు వెడలె నదె
చెంతల నుదుటునుఁ జెదరె నెరిఁగురులు
కంతునికళలును గరఁగెను తుదిని

(॥నీకే ॥)
తరుణిఁ గాఁగిటికి దగ్గరఁ బిలువఁగ
అరిది బాహులత లదె యదరె
యిరవుగ శ్రీవేంకటేశ యిద్దరికి
మరుతంత్రంబుల మర్మము లలరె

(||pallavi||)
nīge tĕlusunu nĕlam̐tabhāvamulu
yīgaḍam̐ galadiyu niṁtemāḍa

(||nīge||)
sĕluvum̐ḍa nīberu sĕvilo nuḍigina
sĕliyagum̐ jĕkkulu sĕmariṁchĕ
pulagalu kusamulam̐ bŏdalĕnu kammara
niluvunivvĕragu niṁḍĕnu madini

(||nīge||)
kāṁtagu nīrūbu kannulam̐ jūbina
viṁtagunagavulu vĕḍalĕ nadĕ
sĕṁtala nuduḍunum̐ jĕdarĕ nĕrim̐gurulu
kaṁtunigaḽalunu garam̐gĕnu tudini

(||nīge ||)
taruṇim̐ gām̐giḍigi daggaram̐ biluvam̐ga
aridi bāhulada ladĕ yadarĕ
yiravuga śhrīveṁkaḍeśha yiddarigi
marudaṁtraṁbula marmamu lalarĕ