నీకే తెలుసునిఁక నే మేమీ నెఱఁగము
(॥పల్లవి॥)
నీకే తెలుసునిఁక నే మేమీ నెఱఁగము
ఆకెకు నీకే తగును అదివో విన్నపము
(॥॥)
యెక్కడి పరాకో యెంత నేము విలిచిన
చెక్కు మీఁదిచేయికాని చిత్త గించదు
నిక్కి నీవు చూచితివి నిన్న మాపటంతనే
అక్కట నేఁడిట్లాయ నదివో విన్నపము
(॥॥)
మందో మంత్రమోకాని మరి బుద్దిచెప్పినాను
చందము తనదేకాని చాయకురాదు
అంది విడె మిచ్చితివి అల్లపు డింతికి నీవే
అందువంక నిట్లాయ నదివో విన్నపము
(॥॥)
యెంతసంతోసమోకాని యెదిరిఁ దన్నెరఁగదు
కాంతలు కాను కిచ్చినాఁ గైకొనదు
వింతగా శ్రీవేంకటేశ వెలఁదిఁ గూడితి విట్టె
అంతలోనే చొక్కఁబోలు నదివో విన్నపము
(||pallavi||)
nīge tĕlusunim̐ka ne memī nĕṟam̐gamu
āgĕgu nīge tagunu adivo vinnabamu
(||||)
yĕkkaḍi parāgo yĕṁta nemu vilisina
sĕkku mīm̐diseyigāni sitta giṁchadu
nikki nīvu sūsidivi ninna mābaḍaṁtane
akkaḍa nem̐ḍiṭlāya nadivo vinnabamu
(||||)
maṁdo maṁtramogāni mari buddisĕppinānu
saṁdamu tanadegāni sāyagurādu
aṁdi viḍĕ michchidivi allabu ḍiṁtigi nīve
aṁduvaṁka niṭlāya nadivo vinnabamu
(||||)
yĕṁtasaṁtosamogāni yĕdirim̐ dannĕram̐gadu
kāṁtalu kānu kichchinām̐ gaigŏnadu
viṁtagā śhrīveṁkaḍeśha vĕlam̐dim̐ gūḍidi viṭṭĕ
aṁtalone sŏkkam̐bolu nadivo vinnabamu