నీకే తెలుసునయ్య నీవు సేసిన చేఁతలు
(॥పల్లవి॥)
నీకే తెలుసునయ్య నీవు సేసిన చేఁతలు
కూకులు వత్తులు సేసె గుట్టుతోనే సిగ్గులు
(॥నీకే॥)
పంతాలు నీతో నెరపి పఁడతి నిన్నిందరిలో
యింతేసిమాట లాడీ నెంతచనవో
వంతువరుసలవారు వాకిటఁ గాచుకుండఁగా
దొంతివెట్టీ నవ్వులెల్లా దొరతన మెట్టిదో
(॥నీకే॥)
అయాలాంటి చదురంగ మాడుదువు రమ్మంటా
యీయెడ నీచేయివట్టీ నెంతపగటో
బాయిటఁ జెలులతోడ పచారించి నీతోడ
దాయిగాఁగఁ బవళించీఁ దన కెంత చెల్లునో
(॥నీకే॥)
విచ్చనవిడిని మొక్కి వీడెము వేసుకొమ్మంటా
యిచ్చకము సేసీ నీకు నెంతనేరుపో
ఇచ్చట శ్రీవేంకటేశ ఇందరిఁ గూడినయట్టె
యెచ్చి కూడితివి తన కెంతమేలు చేరెనో
(||pallavi||)
nīge tĕlusunayya nīvu sesina sem̐talu
kūgulu vattulu sesĕ guṭṭudone siggulu
(||nīge||)
paṁtālu nīdo nĕrabi pam̐ḍadi ninniṁdarilo
yiṁtesimāḍa lāḍī nĕṁtasanavo
vaṁtuvarusalavāru vāgiḍam̐ gāsuguṁḍam̐gā
dŏṁtivĕṭṭī navvulĕllā dŏradana mĕṭṭido
(||nīge||)
ayālāṁṭi saduraṁga māḍuduvu rammaṁṭā
yīyĕḍa nīseyivaṭṭī nĕṁtabagaḍo
bāyiḍam̐ jĕluladoḍa pasāriṁchi nīdoḍa
dāyigām̐gam̐ bavaḽiṁchīm̐ dana kĕṁta sĕlluno
(||nīge||)
vichchanaviḍini mŏkki vīḍĕmu vesugŏmmaṁṭā
yichchagamu sesī nīgu nĕṁtanerubo
ichchaḍa śhrīveṁkaḍeśha iṁdarim̐ gūḍinayaṭṭĕ
yĕchchi kūḍidivi tana kĕṁtamelu serĕno