Neege telusunayya nee suddulu

నీకే తెలుసునయ్య నీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
నీకే తెలుసునయ్య నీ సుద్దులు
పైకొని నేమడిగితే బ్రమయ నేమిటికి

(॥॥)
చెమటేల వచ్చెనో సిగ్గువడి యంతలోనే
చమరి కప్పురదూళి చల్లుకోనేల
సముకాన నేమింతలో సారెసారె నవ్వితేను
అమరఁ దట్టుపుణుఁగు అందుపైఁ బూసేవు

(॥॥)
నీకంటేముందు కప్రము నెలఁతకు మీఁదుకట్టి
దాకొని మిగిలించేల ధరియించేవు
జోకతో నేము నీమోము చూచితేఁ బరాకుచేసి
ఆకెఁ గూడి పన్నీరు అట్టే చల్లుకొనేవు

(॥॥)
తెలుపు కప్పురము నలుపు తట్టుపుణుఁగు
కలగంప రూపులేల కైకొనేవు
చెలి యలమేలుమంగ శ్రీవేంకటేశుఁడవు నీ-
వెలమిఁ గలసి మమ్ము నెంత మన్నించేవు

(||pallavi||)
nīge tĕlusunayya nī suddulu
paigŏni nemaḍigide bramaya nemiḍigi

(||||)
sĕmaḍela vachchĕno sigguvaḍi yaṁtalone
samari kappuradūḽi sallugonela
samugāna nemiṁtalo sārĕsārĕ navvidenu
amaram̐ daṭṭubuṇum̐gu aṁdubaim̐ būsevu

(||||)
nīgaṁṭemuṁdu kapramu nĕlam̐tagu mīm̐dugaṭṭi
dāgŏni migiliṁchela dhariyiṁchevu
jogado nemu nīmomu sūsidem̐ barāgusesi
āgĕm̐ gūḍi pannīru aṭṭe sallugŏnevu

(||||)
tĕlubu kappuramu nalubu taṭṭubuṇum̐gu
kalagaṁpa rūbulela kaigŏnevu
sĕli yalamelumaṁga śhrīveṁkaḍeśhum̐ḍavu nī-
vĕlamim̐ galasi mammu nĕṁta manniṁchevu