Neege telusumgaaga nee volli panulu

నీకే తెలుసుఁగాక నీ వొళ్ళి పనులు
Language

(॥పల్లవి॥)
నీకే తెలుసుఁగాక నీ వొళ్ళి పనులు
కైకొని యెఱుఁగుదుమా కడమ నున్నవారము

(॥॥)
ఔరా నీమాట నిజమందునో కల్లందునొ
దూరి దూరి యేమన్నా దోసమయ్యీని
యేరా నీమోవి యిది యెంగిలో పావనమో
యేరుపరచ వెఱతు మెఱఁగ మితేఁసి

(॥॥)
యేచిననీ కన్నులవి యెఱ్ఱనో తెల్లనో
సూచించితే నిజము నిష్టూరమయ్యీని
తాచి నీగుణము మంచితనమో కపటమో
చేచేత నడుగరా చెప్పేరు వీధిని

(॥॥)
నీవుగా సించినచీర నీదో నొరులదో
భావించి యేమన్నాఁ బచ్చిదోఁచీని
శ్రీవేంకటేశ నేఁడు చేరి నన్నుఁ గూడితివి
నీవే నే ననుకొంటి నిండుకుఁడు మికను

(||pallavi||)
nīge tĕlusum̐gāga nī vŏḽḽi panulu
kaigŏni yĕṟum̐gudumā kaḍama nunnavāramu

(||||)
aurā nīmāḍa nijamaṁduno kallaṁdunŏ
dūri dūri yemannā dosamayyīni
yerā nīmovi yidi yĕṁgilo pāvanamo
yerubarasa vĕṟadu mĕṟam̐ga midem̐si

(||||)
yesinanī kannulavi yĕṭrano tĕllano
sūsiṁchide nijamu niṣhṭūramayyīni
tāsi nīguṇamu maṁchidanamo kabaḍamo
seseda naḍugarā sĕpperu vīdhini

(||||)
nīvugā siṁchinasīra nīdo nŏrulado
bhāviṁchi yemannām̐ bachchidom̐sīni
śhrīveṁkaḍeśha nem̐ḍu seri nannum̐ gūḍidivi
nīve ne nanugŏṁṭi niṁḍugum̐ḍu miganu