నీకే తెలుసు నివి నీవు చేసిన చేఁతలు
(॥పల్లవి॥)
నీకే తెలుసు నివి నీవు చేసిన చేఁతలు
జోకతే నీ మహిమలు చూడ మఱచితిని
(॥నీకే॥)
చెక్కులమెఱుఁగు చూచి చిత్తానఁ దలఁచుకొంటా
మక్కువ నీ కొప్పు చూడ మఱచితిని
చక్కని నీమోవి చూచి సంతోసానఁ దనివొంది
చొక్కపు నీగళరేఖ చూడమఱచితివి
(॥నీకే॥)
కచ్చుపెట్టి నీ నుదుట కస్తూరి నామము చూచి
మచ్చపు నీమోవి చూడ మఱచితిని
అచ్చపు సింగారాల నమరిన రూపు చూచి
చొచ్చి నీమేను సోదించచూడ మఱచితిని
(॥నీకే॥)
నెట్టుకొన్న కళలతో నీనిలువెల్లాఁ జూచి
మట్టున నీ బుజాలు చూడమరిచితిని
ఇట్టె శ్రీవేంకటేశ యిటు నిన్నుఁ గూడి చూచి
చుట్టి చుట్టి మర్మాలెత్తి చూడ మఱచితివి
(||pallavi||)
nīge tĕlusu nivi nīvu sesina sem̐talu
jogade nī mahimalu sūḍa maṟasidini
(||nīge||)
sĕkkulamĕṟum̐gu sūsi sittānam̐ dalam̐sugŏṁṭā
makkuva nī kŏppu sūḍa maṟasidini
sakkani nīmovi sūsi saṁtosānam̐ danivŏṁdi
sŏkkabu nīgaḽarekha sūḍamaṟasidivi
(||nīge||)
kachchubĕṭṭi nī nuduḍa kastūri nāmamu sūsi
machchabu nīmovi sūḍa maṟasidini
achchabu siṁgārāla namarina rūbu sūsi
sŏchchi nīmenu sodiṁchasūḍa maṟasidini
(||nīge||)
nĕṭṭugŏnna kaḽalado nīniluvĕllām̐ jūsi
maṭṭuna nī bujālu sūḍamarisidini
iṭṭĕ śhrīveṁkaḍeśha yiḍu ninnum̐ gūḍi sūsi
suṭṭi suṭṭi marmālĕtti sūḍa maṟasidivi