నీకే తెలుసు నిది నేమేమి విన్నవించేము
(॥పల్లవి॥)
నీకే తెలుసు నిది నేమేమి విన్నవించేము
చేకొన్న రమణి మతి చిక్కుదీర్చవయ్యా
(॥నీకే॥)
మచ్చరమే లేనిసతి మాటలెన్ని యాడినాను
విచ్చనవిడిరతికి వెంగెము గాదు
అచ్చపుమోహాన నింతి ఆయమెంత తాఁకించినా
మచ్చికె పెరుగుఁగాని మఱి నొప్పిలేదు
(॥నీకే॥)
కైవశమయ్యినకాంత కాఁకలెన్ని చల్లినాను
వేవేలై మతికిని వెట్టదోఁచదు
సేవసేసేయట్టి చెలి సిగ్గులెంత రేఁచినాను
మూవంకలపొందులకు మొగచాటై వుండదు
(॥నీకే॥)
సేసవెట్టినమగువ సిగ్గున నెంతమీరినా
వీసమంతాఁ గాఁగిటికి వేసటేది
ఆసల శ్రీవేంకటేశ అంగన నిట్టె కూడితి
వాసితోడి సరసము వడిఁబడదు
(||pallavi||)
nīge tĕlusu nidi nememi vinnaviṁchemu
segŏnna ramaṇi madi sikkudīrsavayyā
(||nīge||)
machcharame lenisadi māḍalĕnni yāḍinānu
vichchanaviḍiradigi vĕṁgĕmu gādu
achchabumohāna niṁti āyamĕṁta tām̐kiṁchinā
machchigĕ pĕrugum̐gāni maṟi nŏppiledu
(||nīge||)
kaivaśhamayyinagāṁta kām̐kalĕnni sallinānu
vevelai madigini vĕṭṭadom̐sadu
sevaseseyaṭṭi sĕli siggulĕṁta rem̐sinānu
mūvaṁkalabŏṁdulagu mŏgasāḍai vuṁḍadu
(||nīge||)
sesavĕṭṭinamaguva sigguna nĕṁtamīrinā
vīsamaṁtām̐ gām̐giḍigi vesaḍedi
āsala śhrīveṁkaḍeśha aṁgana niṭṭĕ kūḍidi
vāsidoḍi sarasamu vaḍim̐baḍadu