(॥పల్లవి॥)
నీకే తెలుసు నయ్య నీ తగవూ
యీకడాకడివారలు యే మందురో కాని
(॥నీకే॥)
అంచెలఁ బెట్టెను చూపు లంగన నీరాకకు
యించుకంత నీజాగు లెరఁగ రాదూ
మంచివాఁడ వంటానె మమ్ము నంపె నీకడకు
యెంచి యిటమీఁదిపను లె ట్టుండునో కాని
(॥నీకే॥)
పడఁతి మొక్కులు నీకు పౌఁజు లెదురుగా నంపె
అడరి నీరాజస మింతౌ తెరఁగదూ
అడియాలము చెప్పంపె నది యెం తైనాఁ గలదు
యెడసి నీ వుండినందుకు కే మనునో కాని
(॥నీకే॥)
కాంత కుచములు నీకు కానికెనా మీఁ దెత్తె
పంతము నీవు చెల్లించేబా గెరఁగదూ
అంతలో శ్రీవెంకటేశ ఆదరించి కూడితిని
యింతటి నీ మేలు దక్కె నిఁక నెంతో కాని
(||pallavi||)
nīge tĕlusu nayya nī tagavū
yīgaḍāgaḍivāralu ye maṁduro kāni
(||nīge||)
aṁchĕlam̐ bĕṭṭĕnu sūbu laṁgana nīrāgagu
yiṁchugaṁta nījāgu lĕram̐ga rādū
maṁchivām̐ḍa vaṁṭānĕ mammu naṁpĕ nīgaḍagu
yĕṁchi yiḍamīm̐dibanu lĕ ṭṭuṁḍuno kāni
(||nīge||)
paḍam̐ti mŏkkulu nīgu paum̐ju lĕdurugā naṁpĕ
aḍari nīrājasa miṁtau tĕram̐gadū
aḍiyālamu sĕppaṁpĕ nadi yĕṁ tainām̐ galadu
yĕḍasi nī vuṁḍinaṁdugu ke manuno kāni
(||nīge||)
kāṁta kusamulu nīgu kānigĕnā mīm̐ dĕttĕ
paṁtamu nīvu sĕlliṁchebā gĕram̐gadū
aṁtalo śhrīvĕṁkaḍeśha ādariṁchi kūḍidini
yiṁtaḍi nī melu dakkĕ nim̐ka nĕṁto kāni