Neege telunayya nerubarivauduvu

నీకే తెలునయ్య నేరుపరివౌదువు
Language

(॥పల్లవి॥)
నీకే తెలునయ్య నేరుపరివౌదువు
వాకున నిద్దరికిని వంతువెట్టేవా

(॥॥)
చాయలకు నాపెతోడ సరసములాడేవు
యీయెడ నాతోనైతే నిటు నవ్వేవు
యేయెడఁ గూరిమి నీకు యెవ్వరివాఁడవు నీవు
పాయము ఇద్దరికిని పంచి పెట్టేవా

(॥॥)
మచ్చికె నాకెదిక్కు మగిడి చూచేవిట్టే
యిచ్చలు నాతో నైతే యిటులాడేవు
కచ్చుపెట్టేదెందు నీకు కాఁగిలి యెవ్వరిసోమ్ము
రిచ్చల నీమనసిద్దరికిఁ దూఁచిచ్చేవా

(॥॥)
వెంట వెంట నాపెను వేమారుఁ గూడేవు
ఇంటికి వచ్చి నన్ను నిటు గూడేవు
జంట యెందు శ్రీవేంకటేశ్వర నీకుఁ బ్రియమేది
రెంటెము నేఁడు యిద్దరిపయిఁ గప్పేవా

(||pallavi||)
nīge tĕlunayya nerubarivauduvu
vāguna niddarigini vaṁtuvĕṭṭevā

(||||)
sāyalagu nābĕdoḍa sarasamulāḍevu
yīyĕḍa nādonaide niḍu navvevu
yeyĕḍam̐ gūrimi nīgu yĕvvarivām̐ḍavu nīvu
pāyamu iddarigini paṁchi pĕṭṭevā

(||||)
machchigĕ nāgĕdikku magiḍi sūseviṭṭe
yichchalu nādo naide yiḍulāḍevu
kachchubĕṭṭedĕṁdu nīgu kām̐gili yĕvvarisommu
richchala nīmanasiddarigim̐ dūm̐sichchevā

(||||)
vĕṁṭa vĕṁṭa nābĕnu vemārum̐ gūḍevu
iṁṭigi vachchi nannu niḍu gūḍevu
jaṁṭa yĕṁdu śhrīveṁkaḍeśhvara nīgum̐ briyamedi
rĕṁṭĕmu nem̐ḍu yiddaribayim̐ gappevā