నీకే తెలసునే నెలఁత యీ గరిమలు
(॥పల్లవి॥)
నీకే తెలసునే నెలఁత యీ గరిమలు
దాకొని నీలో నీవే తలఁచుకోఁ గదవే
(॥నీకే॥)
పిలిచి యాతినిముందు పేరుకుచ్చి దూరనేల
వెలయఁగ నంతలోనే వేఁడుకోనేలా
చలువయు వేఁడియును సరి నొక్కచో నుండునా
చలరేఁగి మరుఁడు చేసినచేఁతగాక
(॥నీకే॥)
పిక్కటిల్లఁ దొలిసారి బీరములాడఁగనేల
పక్కన నీవాతనికి వంతమీనేలా
నెక్కొని చీఁకటియు వెన్నెలాఁ గూడించవచ్చునా
చిక్కించుక మరుఁడు చేసినచేఁత గాక
(॥నీకే॥)
పొదిగి శ్రీవేంకటేశుఁ బొం దెలయంచనేల
ముదమున నింతేసి మొక్కఁగనేల
కదిసి కల్లా నిజము గాడిఁగట్టవసమా
చెదరక మరుఁడు చేసిచేఁత గాక
(||pallavi||)
nīge tĕlasune nĕlam̐ta yī garimalu
dāgŏni nīlo nīve talam̐sugom̐ gadave
(||nīge||)
pilisi yādinimuṁdu peruguchchi dūranela
vĕlayam̐ga naṁtalone vem̐ḍugonelā
saluvayu vem̐ḍiyunu sari nŏkkaso nuṁḍunā
salarem̐gi marum̐ḍu sesinasem̐tagāga
(||nīge||)
pikkaḍillam̐ dŏlisāri bīramulāḍam̐ganela
pakkana nīvādanigi vaṁtamīnelā
nĕkkŏni sīm̐kaḍiyu vĕnnĕlām̐ gūḍiṁchavachchunā
sikkiṁchuga marum̐ḍu sesinasem̐ta gāga
(||nīge||)
pŏdigi śhrīveṁkaḍeśhum̐ bŏṁ dĕlayaṁchanela
mudamuna niṁtesi mŏkkam̐ganela
kadisi kallā nijamu gāḍim̐gaṭṭavasamā
sĕdaraga marum̐ḍu sesisem̐ta gāga