Neege sellum gaani ne nimta kobanu

నీకే చెల్లుఁ గాని నే నింత కోపను
Language

(॥పల్లవి॥)
నీకే చెల్లుఁ గాని నే నింత కోపను
కాకరితనా లెపుడుఁ గలవే నీకును

(॥నీకే॥)
రమణితో నొకమాట రతి నాతొ నొకమాట
అమరదు యెన్నఁడు నీ వాడకురా
కమలము వొకకన్ను కలువయు వొకకన్ను
జమళి రండు నడప సాజయే నీకును

(॥నీకే॥)
కంటే నిందు వచ్చే వాకడిమో మైతే రావు
అంటి నన రాదు మాతో నంత యాలరా
వొంటనిసా మెుకటియూ వొగి గరుత్మంతుని
బంటులఁగా గాడిఁ గట్టి పరచేటివాఁడవు

(॥నీకే॥)
కాఁగిలించే విటు నన్ను కన్ను గిరిపే వాపెతో
దాఁగిలిముచ్చు లాడేవు తగ దేలరా
యేఁగి మింటి కొక కొంగ యెత్తి శ్రీవెంకటగిరి
నాఁగితి రెండు వాదాలు నౌరా నీవూ

(||pallavi||)
nīge sĕllum̐ gāni ne niṁta kobanu
kāgaridanā lĕbuḍum̐ galave nīgunu

(||nīge||)
ramaṇido nŏgamāḍa radi nādŏ nŏgamāḍa
amaradu yĕnnam̐ḍu nī vāḍagurā
kamalamu vŏgagannu kaluvayu vŏgagannu
jamaḽi raṁḍu naḍaba sājaye nīgunu

(||nīge||)
kaṁṭe niṁdu vachche vāgaḍimo maide rāvu
aṁṭi nana rādu mādo naṁta yālarā
vŏṁṭanisā mĕుkaḍiyū vŏgi garutmaṁtuni
baṁṭulam̐gā gāḍim̐ gaṭṭi paraseḍivām̐ḍavu

(||nīge||)
kām̐giliṁche viḍu nannu kannu giribe vābĕdo
dām̐gilimuchchu lāḍevu taga delarā
yem̐gi miṁṭi kŏga kŏṁga yĕtti śhrīvĕṁkaḍagiri
nām̐gidi rĕṁḍu vādālu naurā nīvū