నీకే సెలవని నెపమువేయుట యింతే
(॥పల్లవి॥)
నీకే సెలవని నెపమువేయుట యింతే
కైకొని కాచే నీ వుపకారమే దక్కినది
(॥నీకే॥)
వొట్టి నీ కొఱకుఁగా వుపవాసా లుండేనంటే
అట్టె నీకు లాభము అం దేమున్నది
జట్టిగా నిన్నుఁ గూరిచి సన్యాసి నయ్యే నంటే
చుట్టుకొని నీకు గల్గే సుఖమం దేమున్నది
(॥నీకే॥)
కడు నీ పాదతీర్థపు గంగలో నానే నంటే
అడరిన తనివి నీ కందేమున్నది
అడవిలో ఘోరతప మంది నీకుఁ జేసే నంటే
అడియాలమైన ఫల మందు నీ కేమున్నది
(॥నీకే॥)
నిన్నుఁ గనుఁగొన్నదాఁకానే గడ్డము వెంచే నంటే
అన్నిటా నీకుఁ గూడేది అందేమున్నది
వున్నతి శ్రీవేంకటేశ వూరకే నీ వాఁడ నైతి
యెన్న నీకుఁ గాక యిఁక నం దేమున్నది
(||pallavi||)
nīge sĕlavani nĕbamuveyuḍa yiṁte
kaigŏni kāse nī vubagārame dakkinadi
(||nīge||)
vŏṭṭi nī kŏṟagum̐gā vubavāsā luṁḍenaṁṭe
aṭṭĕ nīgu lābhamu aṁ demunnadi
jaṭṭigā ninnum̐ gūrisi sanyāsi nayye naṁṭe
suṭṭugŏni nīgu galge sukhamaṁ demunnadi
(||nīge||)
kaḍu nī pādadīrdhabu gaṁgalo nāne naṁṭe
aḍarina tanivi nī kaṁdemunnadi
aḍavilo ghoradaba maṁdi nīgum̐ jese naṁṭe
aḍiyālamaina phala maṁdu nī kemunnadi
(||nīge||)
ninnum̐ ganum̐gŏnnadām̐kāne gaḍḍamu vĕṁche naṁṭe
anniḍā nīgum̐ gūḍedi aṁdemunnadi
vunnadi śhrīveṁkaḍeśha vūrage nī vām̐ḍa naidi
yĕnna nīgum̐ gāga yim̐ka naṁ demunnadi