Neege pampu sesumgaaga nememannaam gaigoneenaa

నీకే పంపు సేసుఁగాక నేమేమన్నాఁ గైకొనీనా
Language

(॥పల్లవి॥)
నీకే పంపు సేసుఁగాక నేమేమన్నాఁ గైకొనీనా
యేకడా నీమఱఁగున నిటుండేవారము

(॥నీకే॥)
చెలియ నీచెప్పినట్టు సేసుఁగాక అతఁడు
మలసి మాకెల్లాను మట్టుపడీనా
పిలిచినీపిలుపే ప్రియములై వుండుఁగాక
బలిమి నేము రమ్మంటేఁ బలికీనా అతడు

(॥నీకే॥)
వినవే నీకన్నులకే వెఱచుఁగా కాతఁడు
చెనకి నేము చెప్పితే చెవులొగ్గీనా
చనవిచ్చి నీమొక్కులే చవులై యుండుఁగాక
యెనసి మావినయాల కింటికి వచ్చీనా

(॥నీకే॥)
పై పై నీకూటమికే భ్రమసుఁగా కాతఁడు
తీపులు నేము చూపితే తెమలీనా
యేపున నీయప్పణను యిటు మమ్ము నేలెఁగాక
వోపి శ్రీవేంకటేశుఁడు వొడఁబడీనా

(||pallavi||)
nīge paṁpu sesum̐gāga nememannām̐ gaigŏnīnā
yegaḍā nīmaṟam̐guna niḍuṁḍevāramu

(||nīge||)
sĕliya nīsĕppinaṭṭu sesum̐gāga adam̐ḍu
malasi māgĕllānu maṭṭubaḍīnā
pilisinībilube priyamulai vuṁḍum̐gāga
balimi nemu rammaṁṭem̐ baligīnā adaḍu

(||nīge||)
vinave nīgannulage vĕṟasum̐gā kādam̐ḍu
sĕnagi nemu sĕppide sĕvulŏggīnā
sanavichchi nīmŏkkule savulai yuṁḍum̐gāga
yĕnasi māvinayāla kiṁṭigi vachchīnā

(||nīge||)
pai pai nīgūḍamige bhramasum̐gā kādam̐ḍu
tībulu nemu sūbide tĕmalīnā
yebuna nīyappaṇanu yiḍu mammu nelĕm̐gāga
vobi śhrīveṁkaḍeśhum̐ḍu vŏḍam̐baḍīnā