నీకే భారము మా నేరుపు లేమున్న విఁక
(॥పల్లవి॥)
నీకే భారము మా నేరుపు లేమున్న విఁక
వాకుచ్చి విన్నవించేటి వైపు లెట్టోకాని
(॥నీకే॥)
చెలఁగి పెనఁగేఁగాని సేసవెట్టుతానే చేతు
లలసెఁ గొలిపీనొకొ ఆయమంటితే
తలఁపెల్ల భ్రమసెను దగ్గరి నిన్నుఁ జూచి
యెలమి నీ రతు లె ట్లెరిఁగీనో కాని
(॥నీకే॥)
సరసములాడేఁగాని సరి నీతో నవ్వుతానే
కరఁగె నాయములెల్లాఁ గడమ లెట్టో
పరగెను పులకలు పైకొని నిన్నంటితేనే
తరవాతి పనులెట్టు దైవారీనోకాని
(॥నీకే॥)
వుపమలెంచీ(చేఁ?)గాని వొగి నిన్నుఁ గూడఁగానే
తపము ఫలించె నాకు దైవికమెటో(ట్టో?)
రపమాయ శ్రీ వేంకటరాయ మనకిద్దరికి
నపురూపా లిఁక నెట్లయ్యీనో కాని
(||pallavi||)
nīge bhāramu mā nerubu lemunna vim̐ka
vāguchchi vinnaviṁcheḍi vaibu lĕṭṭogāni
(||nīge||)
sĕlam̐gi pĕnam̐gem̐gāni sesavĕṭṭudāne sedu
lalasĕm̐ gŏlibīnŏgŏ āyamaṁṭide
talam̐pĕlla bhramasĕnu daggari ninnum̐ jūsi
yĕlami nī radu lĕ ṭlĕrim̐gīno kāni
(||nīge||)
sarasamulāḍem̐gāni sari nīdo navvudāne
karam̐gĕ nāyamulĕllām̐ gaḍama lĕṭṭo
paragĕnu pulagalu paigŏni ninnaṁṭidene
taravādi panulĕṭṭu daivārīnogāni
(||nīge||)
vubamalĕṁchī(sem̐?)gāni vŏgi ninnum̐ gūḍam̐gāne
tabamu phaliṁchĕ nāgu daivigamĕḍo(ṭṭo?)
rabamāya śhrī veṁkaḍarāya managiddarigi
naburūbā lim̐ka nĕṭlayyīno kāni