Neege arudu gaani ne merumgudu manniyu

నీకే అరుదు గాని నే మెరుఁగుదు మన్నియు
Language

(॥పల్లవి॥)
నీకే అరుదు గాని నే మెరుఁగుదు మన్నియు
ఆ కడ నంగడిఁ బెట్టి అమ్మరాదా

(॥నీకే॥)
పంచమవేదము నీకు పడఁతిమాట లెల్ల
సంచుల నెవరిమాట చవులయ్యీని
యెంచి సారె సారె నవె యేల మాతోఁ జెప్పేవు
కొంచక నీవే పాటము గొనరాదా

(॥నీకే॥)
కుందనపుఁబొడి నీకు కొమ్మసేసేప్రియములు
అందరుఁ జేసినవెల్ల అందుకు నీడా
చెంది మాతో నేల కొండసేసి చెప్పి వని నీవే
బిందెఁ బోసుకొని నెత్తిఁ బెట్టుకోరాదా

(॥నీకే॥)
చక్కెరబొమ్మ సతి శ్రీవేంకటేశుఁడ
యెక్కడఁ గన్నవా రెల్ల యితవయ్యేరా
మిక్కిలి నన్నుఁ గూడి మెచ్చే వాపె నిఁక నీవు
తక్కక మూలలఁ బెట్టి దాఁచరాదా

(||pallavi||)
nīge arudu gāni ne mĕrum̐gudu manniyu
ā kaḍa naṁgaḍim̐ bĕṭṭi ammarādā

(||nīge||)
paṁchamavedamu nīgu paḍam̐timāḍa lĕlla
saṁchula nĕvarimāḍa savulayyīni
yĕṁchi sārĕ sārĕ navĕ yela mādom̐ jĕppevu
kŏṁchaga nīve pāḍamu gŏnarādā

(||nīge||)
kuṁdanabum̐bŏḍi nīgu kŏmmasesepriyamulu
aṁdarum̐ jesinavĕlla aṁdugu nīḍā
sĕṁdi mādo nela kŏṁḍasesi sĕppi vani nīve
biṁdĕm̐ bosugŏni nĕttim̐ bĕṭṭugorādā

(||nīge||)
sakkĕrabŏmma sadi śhrīveṁkaḍeśhum̐ḍa
yĕkkaḍam̐ gannavā rĕlla yidavayyerā
mikkili nannum̐ gūḍi mĕchche vābĕ nim̐ka nīvu
takkaga mūlalam̐ bĕṭṭi dām̐sarādā