Neegamtem gomalamu nelamta sitta midivo

నీకంటెఁ గోమలము నెలఁత చిత్త మిదివో
Language

(॥పల్లవి॥)
నీకంటెఁ గోమలము నెలఁత చిత్త మిదివో
వాకున నీవే యిటువలె నానతిత్తురా

(॥నీకం॥)
పలికినమాఁటకు పక్కన ను త్తర మిచ్చెఁ
నలివేణి నేల నిష్టూరనేవు నీవు
తలవంచుకొనుండితే తగ నాలిక త్తె నేవు
యెలమి నీతోడిపొందు యెందునుఁ బోరాదు

(॥నీకం॥)
దగ్గరి నీవు రాఁగాను తప్పక చూచె నీసతి
బగ్గన కోపమనేల భావించేవు
సిగ్గున నూరకుండితే చేరి గర్వి యిదె నేవు
యెగ్గుల నీ తోడిపొందు యెందునుఁ బోరాదు

(॥నీకం॥)
చెక్కు నీవు నొక్కఁగాను చేయిమీఁద వేసె నీపె
తక్కక యింతలోనేల తమకె నేవు
అక్కరతో శ్రీవేంకటాధిప నీవు కూడితిఁ
వెక్కువ నీతోడిపొందు యెందునుఁ బోరాదు

(||pallavi||)
nīgaṁṭĕm̐ gomalamu nĕlam̐ta sitta midivo
vāguna nīve yiḍuvalĕ nānaditturā

(||nīgaṁ||)
paliginamām̐ṭagu pakkana nu ttara michchĕm̐
naliveṇi nela niṣhṭūranevu nīvu
talavaṁchugŏnuṁḍide taga nāliga ttĕ nevu
yĕlami nīdoḍibŏṁdu yĕṁdunum̐ borādu

(||nīgaṁ||)
daggari nīvu rām̐gānu tappaga sūsĕ nīsadi
baggana kobamanela bhāviṁchevu
sigguna nūraguṁḍide seri garvi yidĕ nevu
yĕggula nī toḍibŏṁdu yĕṁdunum̐ borādu

(||nīgaṁ||)
sĕkku nīvu nŏkkam̐gānu seyimīm̐da vesĕ nībĕ
takkaga yiṁtalonela tamagĕ nevu
akkarado śhrīveṁkaḍādhiba nīvu kūḍidim̐
vĕkkuva nīdoḍibŏṁdu yĕṁdunum̐ borādu