Neegamte nerubari yee nelamta gaambolunu

నీకంటె నేరుపరి యీ నెలఁత గాఁబోలును
Language

(॥పల్లవి॥)
నీకంటె నేరుపరి యీ నెలఁత గాఁబోలును
వాకున మాటాడకే వద్దికే రప్పించెను

(॥నీకం॥)
మంతనానఁ జెలి నీతో మాటలాడే నని రాఁగా
అంతలో వేరొకతె నీయండ నుండెను
పంతాన లోనికి నేఁగి పవళించెఁ బానుపుపై
చింత దీర నాపెవద్దఁ జేరి కూచుండితివి

(॥నీకం॥)
అట్టె నీతో సరసము లాడే నని సతి రాఁగా
వట్టి వేరొక తె నీపాదా లొత్తెను
బట్టబయలు గాకుండా పచ్చడము నీకుఁ గప్పె
వొట్టి నీ వాపెతొడపై వొరఁగి మొచ్చితివి

(॥నీకం॥)
అలమేలుమంగ నిన్నటు కాఁగిలించ రాఁగా
వెలయ భూకాంత నీకు విడె మిచ్చెను
కలసి యందుకు నాకు కంఠహరమై నిలిచె
చెలఁగి శ్రీవేంకటేశ సేసలు వెట్టితివి

(||pallavi||)
nīgaṁṭĕ nerubari yī nĕlam̐ta gām̐bolunu
vāguna māḍāḍage vaddige rappiṁchĕnu

(||nīgaṁ||)
maṁtanānam̐ jĕli nīdo māḍalāḍe nani rām̐gā
aṁtalo verŏgadĕ nīyaṁḍa nuṁḍĕnu
paṁtāna lonigi nem̐gi pavaḽiṁchĕm̐ bānububai
siṁta dīra nābĕvaddam̐ jeri kūsuṁḍidivi

(||nīgaṁ||)
aṭṭĕ nīdo sarasamu lāḍe nani sadi rām̐gā
vaṭṭi verŏga tĕ nībādā lŏttĕnu
baṭṭabayalu gāguṁḍā pachchaḍamu nīgum̐ gappĕ
vŏṭṭi nī vābĕdŏḍabai vŏram̐gi mŏchchidivi

(||nīgaṁ||)
alamelumaṁga ninnaḍu kām̐giliṁcha rām̐gā
vĕlaya bhūgāṁta nīgu viḍĕ michchĕnu
kalasi yaṁdugu nāgu kaṁṭhaharamai nilisĕ
sĕlam̐gi śhrīveṁkaḍeśha sesalu vĕṭṭidivi