నీకంటె నాపె మేలు నీ వాపెకంటె మేలు
(॥పల్లవి॥)
నీకంటె నాపె మేలు నీ వాపెకంటె మేలు
యీకడ నాకేల బొంకే విఁక నేఁటిమాఁటలు
(॥నీకం॥)
కాయముపై మెత్తినట్టిగందపుబేంట్లు రాలె
యేయెడఁ బెనఁగితివో యెవ్వతె తోడ
ఆయెడఁ గస్తూరిపూఁత అట్టె నీమే నంటి వచ్చె
నీయందు ఇదొకమేలు నిలిచెఁగా యెక్కుడు
(॥నీకం॥)
కప్పినట్టిచంద్రగావి కడు నెరి విరిగెను
వొప్పుగ నెవ్వతెమీఁద నొర గుంటివో
అప్పటి పెంజెమటలు అందుతోనే తొప్పఁ దోగె
తప్పక యీ లాభమును తగిలెఁగా యెక్కుడు
(॥నీకం॥)
ముడిచినతురుమెల్ల మూఁపుమీఁది కిదె జారె
వడిగా నెవ్వతెఁ గూడి వచ్చితివో
నడుమ శ్రీవేంకటేశ నన్ను నిట్టె కూడితివి
కడు నీకు నిందులోనే కలిగెఁగా యెక్కుడు
(||pallavi||)
nīgaṁṭĕ nābĕ melu nī vābĕgaṁṭĕ melu
yīgaḍa nāgela bŏṁke vim̐ka nem̐ṭimām̐ṭalu
(||nīgaṁ||)
kāyamubai mĕttinaṭṭigaṁdabubeṁṭlu rālĕ
yeyĕḍam̐ bĕnam̐gidivo yĕvvadĕ toḍa
āyĕḍam̐ gastūribūm̐ta aṭṭĕ nīme naṁṭi vachchĕ
nīyaṁdu idŏgamelu nilisĕm̐gā yĕkkuḍu
(||nīgaṁ||)
kappinaṭṭisaṁdragāvi kaḍu nĕri virigĕnu
vŏppuga nĕvvadĕmīm̐da nŏra guṁṭivo
appaḍi pĕṁjĕmaḍalu aṁdudone tŏppam̐ dogĕ
tappaga yī lābhamunu tagilĕm̐gā yĕkkuḍu
(||nīgaṁ||)
muḍisinadurumĕlla mūm̐pumīm̐di kidĕ jārĕ
vaḍigā nĕvvadĕm̐ gūḍi vachchidivo
naḍuma śhrīveṁkaḍeśha nannu niṭṭĕ kūḍidivi
kaḍu nīgu niṁdulone kaligĕm̐gā yĕkkuḍu