నీకంటె నాపె మేలు నే మాపె సేవ సేసేము
(॥పల్లవి॥)
నీకంటె నాపె మేలు నే మాపె సేవ సేసేము
మాకు దిష్టము నీ పొందు మమ్ము నింత సేసేనూ
(॥॥)
యిచ్చకమే యాడ నైతి నింతి నీవు గూచుండఁ గా
హెచ్చుకుందు లాడఁగాఁగా నిటురావైతి
అచ్చమై నీకు మొక్కక నాపెకే నే మొక్కనైతి
మచ్చరించఁగాఁగా నాపె మాటలే యీడేరెనూ
(॥॥)
పాదా లొత్త నైతి నీవుఁ బడఁతియుఁ బండుండఁగా
వా దడువఁగాఁగా నీవు వలవవైతి
పోదిసేసి ప్రియములు పొలిఁతికి చెప్ప నైతి
నీ దెస చూడఁగాఁగా నెరపెను చలమూ
(॥॥)
ఆకు మడి చియ్య నైతి నలమేల్మంగకు నీ
కేకతము చెప్పఁగాఁగా నిట్టే నవ్వెను
ఆకె నడిగి శ్రీ వేంకటాధిప నన్నుఁ గూడితి
చేకొలఁదికి రాఁగాఁగా చెలియే మన్నించెను.
(||pallavi||)
nīgaṁṭĕ nābĕ melu ne mābĕ seva sesemu
māgu diṣhṭamu nī pŏṁdu mammu niṁta sesenū
(||||)
yichchagame yāḍa naidi niṁti nīvu gūsuṁḍam̐ gā
hĕchchuguṁdu lāḍam̐gām̐gā niḍurāvaidi
achchamai nīgu mŏkkaga nābĕge ne mŏkkanaidi
machchariṁcham̐gām̐gā nābĕ māḍale yīḍerĕnū
(||||)
pādā lŏtta naidi nīvum̐ baḍam̐tiyum̐ baṁḍuṁḍam̐gā
vā daḍuvam̐gām̐gā nīvu valavavaidi
podisesi priyamulu pŏlim̐tigi sĕppa naidi
nī dĕsa sūḍam̐gām̐gā nĕrabĕnu salamū
(||||)
āgu maḍi siyya naidi nalamelmaṁgagu nī
kegadamu sĕppam̐gām̐gā niṭṭe navvĕnu
āgĕ naḍigi śhrī veṁkaḍādhiba nannum̐ gūḍidi
segŏlam̐digi rām̐gām̐gā sĕliye manniṁchĕnu.