Needu semtalagu neeve dishtamu

నీదు సేఁతలకు నీవే దిష్టము
Language

(॥పల్లవి॥)
నీదు సేఁతలకు నీవే దిష్టము
మేదివి నేమెల్లా మెచ్చితిమయ్యా

(॥॥)
యీడగుకాంతలు యింటనే వుండఁగ
వాడలసతులకు వలచితివి
వోడక క్షీరాబ్ధినుండి రేపల్లెను
తోడనే వెన్నలు దొంగిలినట్లు

(॥॥)
వుంగిటివాసన లొడలనే వుండఁగ
అంగడి గందము లడిగితివి
బంగారు పీతాంబరము నీకుండఁగా
చెంగటికోకలు చేకొన్నట్లు

(॥॥)
ఆసఁ గౌస్తుభము అక్కున నుండఁగ
శ్రీ సతి నురమునఁ జేర్చితివి
సేస శ్రీవేంకటశిఖడు కుండఁగ
రాసికుచగిరుల రమించినట్లు

(||pallavi||)
nīdu sem̐talagu nīve diṣhṭamu
medivi nemĕllā mĕchchidimayyā

(||||)
yīḍagugāṁtalu yiṁṭane vuṁḍam̐ga
vāḍalasadulagu valasidivi
voḍaga kṣhīrābdhinuṁḍi reballĕnu
toḍane vĕnnalu dŏṁgilinaṭlu

(||||)
vuṁgiḍivāsana lŏḍalane vuṁḍam̐ga
aṁgaḍi gaṁdamu laḍigidivi
baṁgāru pīdāṁbaramu nīguṁḍam̐gā
sĕṁgaḍigogalu segŏnnaṭlu

(||||)
āsam̐ gaustubhamu akkuna nuṁḍam̐ga
śhrī sadi nuramunam̐ jersidivi
sesa śhrīveṁkaḍaśhikhaḍu kuṁḍam̐ga
rāsigusagirula ramiṁchinaṭlu