Needom benamgadu ninnu naumgaadanadu

నీతోఁ బెనఁగదు నిన్ను నౌఁగాదనదు
Language

(॥పల్లవి॥)
నీతోఁ బెనఁగదు నిన్ను నౌఁగాదనదు
నీ తలఁపు దెలియక నిట్టూర్పు వుచ్చీని

(॥నీతో॥)
పక్కన నీవాపెను పయ్యదకొంగు వట్టితే
చెక్కునఁ జెయి వెట్టుక సిగ్గుపడీని
చక్కఁగా నప్పటి గోరు చన్నులపై నూఁదితేను
నెక్కొన్న వేడుకతోడ నివ్వెరగందీని

(॥నీతో॥)
తొడిఁబడ నీవాపెను తొడపైకిఁ దీసుకొంటే
చిడుముడి మేనెల్లాఁ జెమరించీని
తడఁబడి యట్టె మోము తప్పక చూచితేను
పొడలుగాఁ జెక్కులెల్లాఁ బులకించీని

(॥నీతో॥)
సారె సారె నీవాపెతో సరసములాడఁగాను
గారబాన నిన్నందుకుఁ గాఁగిలించీని
యీ రీతి శ్రీ వేంకటేశ యింతి నిట్టె కూడితివి నీ
నేరుపులెల్లా మించ నిన్ను మెచ్చీని

(||pallavi||)
nīdom̐ bĕnam̐gadu ninnu naum̐gādanadu
nī talam̐pu dĕliyaga niṭṭūrbu vuchchīni

(||nīdo||)
pakkana nīvābĕnu payyadagŏṁgu vaṭṭide
sĕkkunam̐ jĕyi vĕṭṭuga siggubaḍīni
sakkam̐gā nappaḍi goru sannulabai nūm̐didenu
nĕkkŏnna veḍugadoḍa nivvĕragaṁdīni

(||nīdo||)
tŏḍim̐baḍa nīvābĕnu tŏḍabaigim̐ dīsugŏṁṭe
siḍumuḍi menĕllām̐ jĕmariṁchīni
taḍam̐baḍi yaṭṭĕ momu tappaga sūsidenu
pŏḍalugām̐ jĕkkulĕllām̐ bulagiṁchīni

(||nīdo||)
sārĕ sārĕ nīvābĕdo sarasamulāḍam̐gānu
gārabāna ninnaṁdugum̐ gām̐giliṁchīni
yī rīdi śhrī veṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi nī
nerubulĕllā miṁcha ninnu mĕchchīni