నీతోఁ బంతముగాదు నివ్వెర గింతేకాని
(॥పల్లవి॥)
నీతోఁ బంతముగాదు నివ్వెర గింతేకాని
చేతులు చాఁచి యిట్టె చిత్తగించవయ్యా
(॥నీతో॥)
శిరసు వంచుటేకాని చెలిచూపు నీపై నదె
సరసమాడవయ్యా సారెకు నీవు
ఇరవైన ఆపెగుట్టు యెఱఁగఁజెప్పితి నీకు
విరసము లేదాపెను వేఁడుకోవయ్యా
(॥నీతో॥)
పిలువకున్నదిగాని ప్రేమమెల్ల నీమీఁద
బలిమి దగ్గరవయ్య పైకొని నీవు
కలిగినదేసుమ్మీ కల్లయించు కెఱఁగము
అలుక లేదాపె నీపై నాదరించవయ్యా
(॥నీతో॥)
మాటాడకున్నదిగాని మనసెల్లా నీమీఁద
పాటించి భోగించవయ్య పైపై నీవు
చాటితి శ్రీవేంకటేశ సతి నిట్టె కూడితివి
యీటులేదు మీకిద్దరి కిట్టె వుండరయ్యా
(||pallavi||)
nīdom̐ baṁtamugādu nivvĕra giṁtegāni
sedulu sām̐si yiṭṭĕ sittagiṁchavayyā
(||nīdo||)
śhirasu vaṁchuḍegāni sĕlisūbu nībai nadĕ
sarasamāḍavayyā sārĕgu nīvu
iravaina ābĕguṭṭu yĕṟam̐gam̐jĕppidi nīgu
virasamu ledābĕnu vem̐ḍugovayyā
(||nīdo||)
piluvagunnadigāni premamĕlla nīmīm̐da
balimi daggaravayya paigŏni nīvu
kaliginadesummī kallayiṁchu kĕṟam̐gamu
aluga ledābĕ nībai nādariṁchavayyā
(||nīdo||)
māḍāḍagunnadigāni manasĕllā nīmīm̐da
pāḍiṁchi bhogiṁchavayya paibai nīvu
sāḍidi śhrīveṁkaḍeśha sadi niṭṭĕ kūḍidivi
yīḍuledu mīgiddari kiṭṭĕ vuṁḍarayyā