నీతోడిచుట్టరికాలు నిజమాయను
(॥పల్లవి॥)
నీతోడిచుట్టరికాలు నిజమాయను
యేతుల నీ జాణతనా లివి నిజమాయను
(॥నీతోడి॥)
వావి గద్దంటాఁ జెప్పి వద్దఁ గూచండి మెల్లనె
నీవు నవ్విన నవ్వులె నిజ మాయను
చేవ దేర బుజ్జగించి చెక్కులు నొక్కిన నేఁటి
కోవరపు నీ చెనకులు నిజ మాయను
(॥నీతోడి॥)
గారివించి సందిగొందిఁ గన్నయప్పు డెల్లాను
నేరుపుల నీ మొక్కులు నిజ మాయను
వారివీరిచేత నీవు వడిఁబె ట్టింపినయట్టి
యీరీతినీ పైఁడిలేక లివి నిజ మాయను
(॥నీతోది॥)
కన్నులలె సన్న సేసి కాఁగిలించుకొన్నట్టి
నిన్న మొన్నటి సుద్దులు నిజ మాయను
మన్నించి శ్రీవెంకటేశ మరిగి నన్ను నేలితి
మున్నిటి నీకోరికలు నిజ మాయను
(||pallavi||)
nīdoḍisuṭṭarigālu nijamāyanu
yedula nī jāṇadanā livi nijamāyanu
(||nīdoḍi||)
vāvi gaddaṁṭām̐ jĕppi vaddam̐ gūsaṁḍi mĕllanĕ
nīvu navvina navvulĕ nija māyanu
seva dera bujjagiṁchi sĕkkulu nŏkkina nem̐ṭi
kovarabu nī sĕnagulu nija māyanu
(||nīdoḍi||)
gāriviṁchi saṁdigŏṁdim̐ gannayappu ḍĕllānu
nerubula nī mŏkkulu nija māyanu
vārivīriseda nīvu vaḍim̐bĕ ṭṭiṁpinayaṭṭi
yīrīdinī paim̐ḍilega livi nija māyanu
(||nīdodi||)
kannulalĕ sanna sesi kām̐giliṁchugŏnnaṭṭi
ninna mŏnnaḍi suddulu nija māyanu
manniṁchi śhrīvĕṁkaḍeśha marigi nannu nelidi
munniḍi nīgorigalu nija māyanu