Needo vaadugu ne noba

నీతో వాదుకు నే నోప
Language

(॥పల్లవి॥)
నీతో వాదుకు నే నోప
యేతుల కిఁక నీ వే మైన ననరా

(॥నీతో॥)
బచ్చనమాటలు పలుమరు నాడఁగ
యెచ్చుకుందు లిఁక నే మౌనో
వొచ్చము లే కే నూర కుండఁగా
యిచ్చకొలఁది నీ వే మైన ననరా

(॥నీతో॥)
చేకొని బత్తులు సేయఁగ రాఁగా
నేకొలఁది బడునో యెన్నికలు
చీకా కయి నే సిగ్గున నుండఁగ
యీకొలఁదుల నీ వే మైన ననరా

(॥నోతో॥)
గుఱిగాఁ గాఁగిటఁ గూడఁగఁ రాఁగా
నెఱుకలు మఱపులు నే మవునో
నెఱి శ్రీవెంకటనిలయుఁడ నీవే
యెఱిఁగి కలిసితివి యే మయిన ననరా

(||pallavi||)
nīdo vādugu ne noba
yedula kim̐ka nī ve maina nanarā

(||nīdo||)
bachchanamāḍalu palumaru nāḍam̐ga
yĕchchuguṁdu lim̐ka ne mauno
vŏchchamu le ke nūra kuṁḍam̐gā
yichchagŏlam̐di nī ve maina nanarā

(||nīdo||)
segŏni battulu seyam̐ga rām̐gā
negŏlam̐di baḍuno yĕnnigalu
sīgā kayi ne sigguna nuṁḍam̐ga
yīgŏlam̐dula nī ve maina nanarā

(||nodo||)
guṟigām̐ gām̐giḍam̐ gūḍam̐gam̐ rām̐gā
nĕṟugalu maṟabulu ne mavuno
nĕṟi śhrīvĕṁkaḍanilayum̐ḍa nīve
yĕṟim̐gi kalisidivi ye mayina nanarā