Needo sayyaadaalagu ne mobamu

నీతో చయ్యాటాలకు నే మోపము
Language

(॥పల్లవి॥)
నీతో చయ్యాటాలకు నే మోపము
ఆతనికి నీకునే యమరుఁ గాని

(॥నీతో॥)
మొలచేవి నీమైఁబులక మోసులు
సెలవులఁగారేవి చిరునవ్వులు
నెలకొనేవి మోమున నిండుఁగళలు
చెలియ నీ వేమనినాఁజెల్లునమ్మా

(॥నీతో॥)
పెరిగేవి పయ్యదలో పెనుగుబ్బలు
వొరగేది మూఁపుమీఁద వొప్పులకొప్పు
సరుసఁ బారేవి నీసళుపుఁ జూపులు
తరుణి నీకతలకు దండమమ్మా

(॥నీతో॥)
చిప్పిలేవి మేనఁ బెంజెమటలు
ముప్పిరిగొనేవి నీమోవితేనేలు
యిప్పుడె శ్రీవేంకటేశుఁ డేలె నన్ను
కప్పుర గందివి మమ్ముఁ గరుణించవమ్మా

(||pallavi||)
nīdo sayyāḍālagu ne mobamu
ādanigi nīgune yamarum̐ gāni

(||nīdo||)
mŏlasevi nīmaim̐bulaga mosulu
sĕlavulam̐gārevi sirunavvulu
nĕlagŏnevi momuna niṁḍum̐gaḽalu
sĕliya nī vemaninām̐jĕllunammā

(||nīdo||)
pĕrigevi payyadalo pĕnugubbalu
vŏragedi mūm̐pumīm̐da vŏppulagŏppu
sarusam̐ bārevi nīsaḽubum̐ jūbulu
taruṇi nīgadalagu daṁḍamammā

(||nīdo||)
sippilevi menam̐ bĕṁjĕmaḍalu
muppirigŏnevi nīmovidenelu
yippuḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu
kappura gaṁdivi mammum̐ garuṇiṁchavammā