నీతో సరివారమా నీవే మన్నింతువుగాక
(॥పల్లవి॥)
నీతో సరివారమా నీవే మన్నింతువుగాక
యీతల విచారించితే నిటువంటివారము
(॥నీతో॥)
నెరులు నిడుపుగాను నెమ్మది బెంతుముగాని
తురుము వేఁకమయ్యేది తోఁచ దెంతైనా
పిరుఁదు పిక్కటిలితే బీరాన నుండుటగాని
గరిమ మందగమన గది దెలియరాదు
(॥నీతో॥)
చన్నులు గట్టు లంటాను సారె గరింతుముగాని
సన్నపు నడిమి యలసత యెంచము
కన్నులు గొప్ప లంటాను కాఁడఁ జూచుటేకాని
మిన్నక తలచుట్టిగా మించేది దలఁచము
(॥నీతో॥)
చేలి మోవి తేనెయంటా చిప్పిలు టింతేకాని
వూరకె యన్ను వట్టేది వూహించలేదు
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నేఁడు
కూరిమి మా సంతోసాలు గురుతు వెట్టరాదు
(||pallavi||)
nīdo sarivāramā nīve manniṁtuvugāga
yīdala visāriṁchide niḍuvaṁṭivāramu
(||nīdo||)
nĕrulu niḍubugānu nĕmmadi bĕṁtumugāni
turumu vem̐kamayyedi tom̐sa dĕṁtainā
pirum̐du pikkaḍilide bīrāna nuṁḍuḍagāni
garima maṁdagamana gadi dĕliyarādu
(||nīdo||)
sannulu gaṭṭu laṁṭānu sārĕ gariṁtumugāni
sannabu naḍimi yalasada yĕṁchamu
kannulu gŏppa laṁṭānu kām̐ḍam̐ jūsuḍegāni
minnaga talasuṭṭigā miṁchedi dalam̐samu
(||nīdo||)
seli movi tenĕyaṁṭā sippilu ṭiṁtegāni
vūragĕ yannu vaṭṭedi vūhiṁchaledu
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi mammu nem̐ḍu
kūrimi mā saṁtosālu gurudu vĕṭṭarādu