నీతో నేఁ బంత మాడేనా నీదాననే
(॥పల్లవి॥)
నీతో నేఁ బంత మాడేనా నీదాననే
యేతులు చెల్లించుకొంటి వెదురేది నీకు
(॥నీతో॥)
యెలయింపుమాటలనే యెక్కుడుగా వలపించి
కొలఁదిఁ బెండ్లాడితివి గొల్లెతలను
బలిమి రుక్మిణిఁ దెచ్చి పట్టిపుదేవులఁ జేసి
చలమీడేర్చుకొంటివి సరి లేదు నీకు
(॥నీతో॥)
పైకొని మేనిమీఁది పాయపుమదము చూపి
కైకొంటివి మధురలో గందమాపెను
ఆకడఁ బదారువేల నందరిపైఁ దెచ్చుకొని
మేకులు మెరసితివి మితి లేదు నీకు
(॥నీతో॥)
దిక్కులెల్లా సాదించి దీమసముతో గెలిచి
యెక్కువ రాచకూఁతులనేలితివి
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
అక్కర దీరుచుకొంటి వడ్డమేదీ నీకు
(||pallavi||)
nīdo nem̐ baṁta māḍenā nīdānane
yedulu sĕlliṁchugŏṁṭi vĕduredi nīgu
(||nīdo||)
yĕlayiṁpumāḍalane yĕkkuḍugā valabiṁchi
kŏlam̐dim̐ bĕṁḍlāḍidivi gŏllĕdalanu
balimi rukmiṇim̐ dĕchchi paṭṭibudevulam̐ jesi
salamīḍersugŏṁṭivi sari ledu nīgu
(||nīdo||)
paigŏni menimīm̐di pāyabumadamu sūbi
kaigŏṁṭivi madhuralo gaṁdamābĕnu
āgaḍam̐ badāruvela naṁdaribaim̐ dĕchchugŏni
megulu mĕrasidivi midi ledu nīgu
(||nīdo||)
dikkulĕllā sādiṁchi dīmasamudo gĕlisi
yĕkkuva rāsagūm̐tulanelidivi
yikkaḍa śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
akkara dīrusugŏṁṭi vaḍḍamedī nīgu