(॥పల్లవి॥)
నీతో నవ్వఁగలమా నెరజాణవు
గాతసేయ కెట్టైనాఁ గరుణించవయ్యా
(॥॥)
గోవులనెల్లాఁ గాచి గొల్లెతలపొందు సేసి
కోవిదుఁడ వైతివి గోవిందరాజా
వావు లొక్కటిగాఁ జేసి వన్నకాఁడవై తిరిగి
గొవాళుఁడ వైతివి గోవిందరాజ
(॥॥)
దూడలఁ గొనాళ్లు గాచి తూలేటివుట్లు గొట్టి
కూడుకొంటివి బాలుల గోవిందరాజ
వేడుకకాఁడ వేవేలు సేఁతలు సేసి
కోడెకాఁడ వైతివి గోవిందరాజ
(॥॥)
చిఱుతవాఁడవై నీవు చీరలు దొంగిలుకొని
కొఱతలు మాన్పితివి గోవిందరాజ
యెఱిఁగి శ్రీ వేంకటాద్రి నిందరినిఁ బెండ్లాడి
గుఱిగా నిలిచితివి గోవిందరాజ
(||pallavi||)
nīdo navvam̐galamā nĕrajāṇavu
gādaseya kĕṭṭainām̐ garuṇiṁchavayyā
(||||)
govulanĕllām̐ gāsi gŏllĕdalabŏṁdu sesi
kovidum̐ḍa vaidivi goviṁdarājā
vāvu lŏkkaḍigām̐ jesi vannagām̐ḍavai tirigi
gŏvāḽum̐ḍa vaidivi goviṁdarāja
(||||)
dūḍalam̐ gŏnāḽlu gāsi tūleḍivuṭlu gŏṭṭi
kūḍugŏṁṭivi bālula goviṁdarāja
veḍugagām̐ḍa vevelu sem̐talu sesi
koḍĕgām̐ḍa vaidivi goviṁdarāja
(||||)
siṟudavām̐ḍavai nīvu sīralu dŏṁgilugŏni
kŏṟadalu mānpidivi goviṁdarāja
yĕṟim̐gi śhrī veṁkaḍādri niṁdarinim̐ bĕṁḍlāḍi
guṟigā nilisidivi goviṁdarāja