నీతో మాటాడఁ బోతే నింద వచ్చును
(॥పల్లవి॥)
నీతో మాటాడఁ బోతే నింద వచ్చును
యే తెరువుఁ బో నోప మాయింటనే వుండే మయ్యా
(॥నీతో॥)
సిగ్గులు ముదిరితే సెలవికి నవ్వు వచ్చు
బగ్గన నవ్వితేఁ గోపము వచ్చును
వొగ్గి కోపగించఁ బోతే వొక టొకటే వచ్చును
యెగ్గులకు నోపము మాయింటనే వుండే మయ్యా
(॥నీతో॥)
సరసాలు ముదిరితే సారెఁ జేపట్లకు వచ్చుఁ
దొరల చేఁ బట్టఁ బోతే దూరు వచ్చును
మరలి ఆదూరులు మరి యెందు కైనా వచ్చు
నిరవు లెరిఁగితిమి యింటనే వుండే మయ్యా
(॥నీతో॥)
తప్పక నిన్నుఁ జూచితే తలపోఁతలకు వచ్చు
కప్పినతలపోఁతల కాఁక వచ్చును
యిప్పుడె శ్రీవెంకటేశ యెనసితి విదె నన్ను
యెప్పుడూఁ బాయక మాయింటనే వుండే మయ్యా
(||pallavi||)
nīdo māḍāḍam̐ bode niṁda vachchunu
ye tĕruvum̐ bo noba māyiṁṭane vuṁḍe mayyā
(||nīdo||)
siggulu mudiride sĕlavigi navvu vachchu
baggana navvidem̐ gobamu vachchunu
vŏggi kobagiṁcham̐ bode vŏga ṭŏgaḍe vachchunu
yĕggulagu nobamu māyiṁṭane vuṁḍe mayyā
(||nīdo||)
sarasālu mudiride sārĕm̐ jebaṭlagu vachchum̐
dŏrala sem̐ baṭṭam̐ bode dūru vachchunu
marali ādūrulu mari yĕṁdu kainā vachchu
niravu lĕrim̐gidimi yiṁṭane vuṁḍe mayyā
(||nīdo||)
tappaga ninnum̐ jūside talabom̐talagu vachchu
kappinadalabom̐tala kām̐ka vachchunu
yippuḍĕ śhrīvĕṁkaḍeśha yĕnasidi vidĕ nannu
yĕppuḍūm̐ bāyaga māyiṁṭane vuṁḍe mayyā