Needo balimi soobu nerudumaa yemainaa

నీతో బలిమి చూపు నేరుతుమా యేమైనా
Language

(॥పల్లవి॥)
నీతో బలిమి చూపు నేరుతుమా యేమైనా
యేతులూ నెమ్మెలూ మరి యేమి చెప్పేమిఁకను

(॥నీతో॥)
వలపు మదిలో నుండు వాకున సొలపులుండు
కలిగిన కాంక్షలెల్లా కన్నులనుండు
చలము గుణాలనుండు చవులు రతులనుండు
యెలమి మావిన్నపము లేమిచెప్పే మిఁకను

(॥నీతో॥)
నవ్వులు సెలవినుండు నయాలు చేతల నుండు
జవ్వనము నిలువెల్లా సతమై వుండు
రవ్వలు కాఁకలనుండు రాజసమిచ్చలనుండు
యెవ్వరమూఁ దమకించి యేమి చెప్పేమిఁకను

(॥నీతో॥)
పంతాలు వాసులనుండు భావము గర్వాననుండు
చింతలెల్లా లోలోని సిగ్గులనుండు
అంతటా శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
ఇంతలో నన్నేలితివి యేమి చెప్పేదిఁకను

(||pallavi||)
nīdo balimi sūbu nerudumā yemainā
yedulū nĕmmĕlū mari yemi sĕppemim̐kanu

(||nīdo||)
valabu madilo nuṁḍu vāguna sŏlabuluṁḍu
kaligina kāṁkṣhalĕllā kannulanuṁḍu
salamu guṇālanuṁḍu savulu radulanuṁḍu
yĕlami māvinnabamu lemisĕppe mim̐kanu

(||nīdo||)
navvulu sĕlavinuṁḍu nayālu sedala nuṁḍu
javvanamu niluvĕllā sadamai vuṁḍu
ravvalu kām̐kalanuṁḍu rājasamichchalanuṁḍu
yĕvvaramūm̐ damagiṁchi yemi sĕppemim̐kanu

(||nīdo||)
paṁtālu vāsulanuṁḍu bhāvamu garvānanuṁḍu
siṁtalĕllā loloni siggulanuṁḍu
aṁtaḍā śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
iṁtalo nannelidivi yemi sĕppedim̐kanu