నీదిక్కే చూచి వాడే నీమగఁడు
(॥పల్లవి॥)
నీదిక్కే చూచి వాడే నీమగఁడు
సాదించీ మీ వెూహములు సందడించీఁ జుమ్మీ
(॥॥)
చక్కని నీవదనము సారెనేల వంచేవే
చిక్కని నీనగవులు చిందీఁ జుమ్మీ
చెక్కిటి మీఁద నటు చేయి యేల పెట్టేవే
అక్కజపు మోముకళ లంటుకొనీఁ జుమ్మీ
(॥॥)
సన్నలనే నీ బొమ్మల వంకెన లేల చూపేవే
మిన్నక వజ్రాల బొట్టు మెరచీఁ జుమ్మీ
చన్నుల మీఁది పయ్యద చక్కబిగించుకొనే
మున్నే జక్కవ పిల్లలు మూఁతులెత్తీ జుమ్మీ
(॥॥)
సిగ్గుతో నేల ముంజేతి చిలుకతో మాటాడేవే
వొగ్గి తరితీపులెల్లా నూరీఁ జుమ్మీ
అగ్గమై శ్రీవేంకటేశుఁ డంతలోనె నిన్నుఁ గూడె
తగ్గక యీసింగారము దైవారీఁ జుమ్మీ
(||pallavi||)
nīdikke sūsi vāḍe nīmagam̐ḍu
sādiṁchī mī vĕూhamulu saṁdaḍiṁchīm̐ jummī
(||||)
sakkani nīvadanamu sārĕnela vaṁcheve
sikkani nīnagavulu siṁdīm̐ jummī
sĕkkiḍi mīm̐da naḍu seyi yela pĕṭṭeve
akkajabu momugaḽa laṁṭugŏnīm̐ jummī
(||||)
sannalane nī bŏmmala vaṁkĕna lela sūbeve
minnaga vajrāla bŏṭṭu mĕrasīm̐ jummī
sannula mīm̐di payyada sakkabigiṁchugŏne
munne jakkava pillalu mūm̐tulĕttī jummī
(||||)
siggudo nela muṁjedi silugado māḍāḍeve
vŏggi taridībulĕllā nūrīm̐ jummī
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ ninnum̐ gūḍĕ
taggaga yīsiṁgāramu daivārīm̐ jummī