నీతి యెంచి నాయకుఁడు నిన్నే మీ ననక నగె
(॥పల్లవి॥)
నీతి యెంచి నాయకుఁడు నిన్నే మీ ననక నగె
చేతుల మొక్కి ప్రియాలు చెప్పఁగదవే
(॥నీతి॥)
వెంగెము లాడఁజనదు వేఁడుకొనవలెఁ గాని
పంగెము గలట్టిసతి పతి నేపొద్దు
వుంగరాలవేళ చేత నూఁది వూఁది యితనిఁ
నెంగిలిమోవి మాఁటల నేల దూరవే
(॥నీతి॥)
అలుగఁ దగదు మరి నాస చూపవలెఁ గాని
వలచినజవరాలు వంచనతోను
తలవంచుకొని యిట్టె తలుపు మాటున నుండి
యెలయింపుసణఁగులు యేల రాల్చేవే
(॥నీతి॥)
కడు సిగ్గుపడరాదు కాఁగిలించవలెఁ గాని
యెడసి వుండఁగలేనియింతి లాలించి
ఆడరి శ్రీవేంకటేశుఁ డట్టె ని న్నేలితే మెచ్చె
యిడియకుండాఁ జన్నుల నెంత వొ త్తేవే
(||pallavi||)
nīdi yĕṁchi nāyagum̐ḍu ninne mī nanaga nagĕ
sedula mŏkki priyālu sĕppam̐gadave
(||nīdi||)
vĕṁgĕmu lāḍam̐janadu vem̐ḍugŏnavalĕm̐ gāni
paṁgĕmu galaṭṭisadi padi nebŏddu
vuṁgarālaveḽa seda nūm̐di vūm̐di yidanim̐
nĕṁgilimovi mām̐ṭala nela dūrave
(||nīdi||)
alugam̐ dagadu mari nāsa sūbavalĕm̐ gāni
valasinajavarālu vaṁchanadonu
talavaṁchugŏni yiṭṭĕ talubu māḍuna nuṁḍi
yĕlayiṁpusaṇam̐gulu yela rālseve
(||nīdi||)
kaḍu siggubaḍarādu kām̐giliṁchavalĕm̐ gāni
yĕḍasi vuṁḍam̐galeniyiṁti lāliṁchi
āḍari śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ ni nnelide mĕchchĕ
yiḍiyaguṁḍām̐ jannula nĕṁta vŏ tteve