Needi visaarimchugove neelo neeve

నీతి విచారించుకోవే నీలో నీవే
Language

(॥పల్లవి॥)
నీతి విచారించుకోవే నీలో నీవే
కాతరించి దూరుదురా కలికిరో నీవు

(॥॥)
సారె బతిసముకాన సతులతో నవ్వఁగాను
వూరకే వండుదురా వొద్దివారెల్లా
కోరి నీ వందుకుఁగాను కొడిమెలు గట్టేవు
ఆరజకతైవుగదే అంగనరో నీవు

(॥॥)
గద్దెమీఁదనుండాతడు కప్పురము లియ్యఁగాను
గద్దించి వొల్లమందురా కామినులెల్లా
వద్దనుండి ఇందుకుఁగా వావు లేరుపరచేవు
సుద్దులకత్తెవుగదే సుదతిరో నీవు

(॥॥)
శ్రీ వేంకటేశుఁడు మెచ్చి చేరి కాఁగిలించఁ గాను
దేవుళ్ళఁ గామందురా పొందినవారెల్లా
నీవుఁ గూడి యిందుకుఁ గా నిండుఁజుట్టాలఁ జేసేవు
వోవలకతైవుగదే వువిదరో నీవు

(||pallavi||)
nīdi visāriṁchugove nīlo nīve
kādariṁchi dūrudurā kaligiro nīvu

(||||)
sārĕ badisamugāna sadulado navvam̐gānu
vūrage vaṁḍudurā vŏddivārĕllā
kori nī vaṁdugum̐gānu kŏḍimĕlu gaṭṭevu
ārajagadaivugade aṁganaro nīvu

(||||)
gaddĕmīm̐danuṁḍādaḍu kappuramu liyyam̐gānu
gaddiṁchi vŏllamaṁdurā kāminulĕllā
vaddanuṁḍi iṁdugum̐gā vāvu lerubarasevu
suddulagattĕvugade sudadiro nīvu

(||||)
śhrī veṁkaḍeśhum̐ḍu mĕchchi seri kām̐giliṁcham̐ gānu
devuḽḽam̐ gāmaṁdurā pŏṁdinavārĕllā
nīvum̐ gūḍi yiṁdugum̐ gā niṁḍum̐juṭṭālam̐ jesevu
vovalagadaivugade vuvidaro nīvu