Needevulu sese semta nemu sesemaa

నీదేవులు సేసే సేఁత నేము సేసేమా
Language

(॥పల్లవి॥)
నీదేవులు సేసే సేఁత నేము సేసేమా
యీదెస నిద్దరు నున్నా రిఁకనేఁటి సుద్దులు

(॥॥)
వూడిగాలవారము వొరసేమా నిన్ను నంత
ఆడానీడా నిచ్చకములాడేము గాక
పాడిపంతాలతో నీచే బాససేయించుకొనేమా
జోడుగూడ బుద్దిచెప్పి చొక్కించేము గాక

(॥॥)
చెలికత్తెలము నేము చెరఁగువట్టి తీసేమా
చెలగి మీ కొడఁబాటు సేసేము గాక
చలపట్టి నిన్ను మరి సారె సారె దూరేమా
పొలసి మీ నేర్పులు పొగడేము గాక

(॥॥)
చుట్టపువారమట రేసున బలిమిసేసేమా
మెట్టిపట్టి మీరతులు మెచ్చేము గాక
ఇట్టె శ్రీవేంకటేశ యెనసితి రింతలోనె
గుట్టున మీ మేళ్లెల్లా గోరెము గాక

(||pallavi||)
nīdevulu sese sem̐ta nemu sesemā
yīdĕsa niddaru nunnā rim̐kanem̐ṭi suddulu

(||||)
vūḍigālavāramu vŏrasemā ninnu naṁta
āḍānīḍā nichchagamulāḍemu gāga
pāḍibaṁtālado nīse bāsaseyiṁchugŏnemā
joḍugūḍa buddisĕppi sŏkkiṁchemu gāga

(||||)
sĕligattĕlamu nemu sĕram̐guvaṭṭi tīsemā
sĕlagi mī kŏḍam̐bāḍu sesemu gāga
salabaṭṭi ninnu mari sārĕ sārĕ dūremā
pŏlasi mī nerbulu pŏgaḍemu gāga

(||||)
suṭṭabuvāramaḍa resuna balimisesemā
mĕṭṭibaṭṭi mīradulu mĕchchemu gāga
iṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidi riṁtalonĕ
guṭṭuna mī meḽlĕllā gorĕmu gāga