Needala soobulu neegele yee

నీడల చూపులు నీకేలే యీ
Language

(॥పల్లవి॥)
నీడల చూపులు నీకేలే యీ
వాడక వాడెడి వడ నీకేలే

(॥నీడల॥)
నిలువుల నటనలు నీకేలే యీ
నిలుగుల నడపులు నీకేలే
నెలవులకరఁగులు నీకేలే యీ
కులికెటి నును సిగ్గులు నీకేలే

(॥నీడల॥)
నెఱుల చెదరులివి నీకేలే యీ
నెఱవగు చదరులు నీకేలే
నెఱతనపుసరులు నీకేలే యిదె
చెఱఁగునమూసెదు చెలి నీకేలే

(॥నీడల॥)
నిక్కపుఁబోఁకులు నీకేలే యిదె
నిక్కలగంటివి నీకేలే
నిక్కితి వొరపుల నీకేలే యిదె
దక్కె వేంకటోత్తముఁడు నీకేలే

(||pallavi||)
nīḍala sūbulu nīgele yī
vāḍaga vāḍĕḍi vaḍa nīgele

(||nīḍala||)
niluvula naḍanalu nīgele yī
nilugula naḍabulu nīgele
nĕlavulagaram̐gulu nīgele yī
kuligĕḍi nunu siggulu nīgele

(||nīḍala||)
nĕṟula sĕdarulivi nīgele yī
nĕṟavagu sadarulu nīgele
nĕṟadanabusarulu nīgele yidĕ
sĕṟam̐gunamūsĕdu sĕli nīgele

(||nīḍala||)
nikkabum̐bom̐kulu nīgele yidĕ
nikkalagaṁṭivi nīgele
nikkidi vŏrabula nīgele yidĕ
dakkĕ veṁkaḍottamum̐ḍu nīgele