Needaamka valenaa nikhilamu vaarigella

నీదాఁక వలెనా నిఖిలము వారికెల్ల
Language

(॥పల్లవి॥)
నీదాఁక వలెనా నిఖిలము వారికెల్ల
ఆది నీ దాసుఁడె చాలు నందరి రక్షించ

(॥నీదా॥)
నీ పాదమూలముల నిలిచిన జలములు
మోపుగా మోఁచె రుద్రుఁడు ముందు ముందె
కాపాడు నీ నామమునఁ గలిగిన మహిమచే
పై పై మునులు యిహపరములు గనిరి

(॥నీదా॥)
పండేటి పాలవెల్లి నీ ప్రసాదమునఁ గాదె
దండిగా దేవతలెల్లా ధన్యులైరి
అండనె నీ సాకార మాతుమఁ దలఁచి గాదె
నిండిన యోగీంద్రులు నిత్యముక్తు లైరి

(॥నీదా॥)
చేరి నీ విహారమైన శ్రీ వేంకటాద్రి గాదె
కోరివరము లందరు కొల్లగొనిరి
ఆరీతిఁ దాళ్లపాక అన్నమయ్య ఘనుఁడాయ
వారివారమైన నేము వహికి నెక్కితిమి

(||pallavi||)
nīdām̐ka valĕnā nikhilamu vārigĕlla
ādi nī dāsum̐ḍĕ sālu naṁdari rakṣhiṁcha

(||nīdā||)
nī pādamūlamula nilisina jalamulu
mobugā mom̐sĕ rudrum̐ḍu muṁdu muṁdĕ
kābāḍu nī nāmamunam̐ galigina mahimase
pai pai munulu yihabaramulu ganiri

(||nīdā||)
paṁḍeḍi pālavĕlli nī prasādamunam̐ gādĕ
daṁḍigā devadalĕllā dhanyulairi
aṁḍanĕ nī sāgāra mādumam̐ dalam̐si gādĕ
niṁḍina yogīṁdrulu nityamuktu lairi

(||nīdā||)
seri nī vihāramaina śhrī veṁkaḍādri gādĕ
korivaramu laṁdaru kŏllagŏniri
ārīdim̐ dāḽlabāga annamayya ghanum̐ḍāya
vārivāramaina nemu vahigi nĕkkidimi