నీదా(దాఁ?)క వలెనా నెగడె మరుబలాలు
(॥పల్లవి॥)
నీదా(దాఁ?)క వలెనా నెగడె మరుబలాలు
భేదము లేదని వింటిఁ బెంచితిమె నేము
(॥నీదా॥)
పలుకకువే నీవు పడఁతీ యీ -
పలికేచిలుకలు నీప్రతి గాదా
కులుకకువే నీకుచములు యీ -
పొలయుజక్కవలు ఆపోలికే కాదా
(॥నీదా॥)
సోవలఁ బాడకువే సుదతీ యీ -
కోవిలపాట లందలిగుణమే కాదా
చేవదేర నవ్వకువే చెలియా యీ
కావరపువెన్నెల లాగతులే కావా
(॥నీదా॥)
మీఁదఁ జేయివేయకువే మెలుఁతా
పోదిగొన్నతీఁగె లాపొరుగేకాదా
నాదించి శ్రీవేంకటాద్రినాథుఁడ నేనూ నన్ను
సోదించి కూడితి నీ సొమ్మయితిఁ జాలదా
(||pallavi||)
nīdā(dām̐?)ka valĕnā nĕgaḍĕ marubalālu
bhedamu ledani viṁṭim̐ bĕṁchidimĕ nemu
(||nīdā||)
palugaguve nīvu paḍam̐tī yī -
paligesilugalu nīpradi gādā
kulugaguve nīgusamulu yī -
pŏlayujakkavalu ābolige kādā
(||nīdā||)
sovalam̐ bāḍaguve sudadī yī -
kovilabāḍa laṁdaliguṇame kādā
sevadera navvaguve sĕliyā yī
kāvarabuvĕnnĕla lāgadule kāvā
(||nīdā||)
mīm̐dam̐ jeyiveyaguve mĕlum̐tā
podigŏnnadīm̐gĕ lābŏrugegādā
nādiṁchi śhrīveṁkaḍādrināthum̐ḍa nenū nannu
sodiṁchi kūḍidi nī sŏmmayidim̐ jāladā