Needaa yamdaa nokkade ninubomtigi

నీడా యండా నొక్కటే నినుబోఁటికి
Language

(॥పల్లవి॥)
నీడా యండా నొక్కటే నినుబోఁటికి
ఆడకురా మారుమాట లాయనాయఁ బదరా

(॥॥)
తెల్లని వెల్లాఁ బాలే తెలిసితి వవులేరా
గొల్ల దేమటాయ నాఁడుగుల మెల్లాను
చల్లలమ్మఁ బోనీరా సారె నన్నుఁ బట్టకురా
చల్లువలపులు పైపైఁ జప్పనాయఁ బదరా

(॥॥)
కన్నదే కంటి గురుమ కంటివి నీవవులేరా
అన్నిటా నీ కాఁడుఁబోడి అగ్గువా యను
నన్ను నింటి కేఁగనీరా నవ్వులెల్లఁ జాలుఁజాలు
వెన్న నున్నగా నూరితే వేసటాయఁ బదరా

(॥॥)
పట్టినదే పంతమాయఁ బై కొంటి వవులేరా
కట్టినకంకణమాయఁ గాంతలెల్లాను
ఇట్టె శ్రీ వేంకటేశ ఇరవై కూడితి నన్ను
దట్టమైనతమకమే తగులాయఁ బదరా

(||pallavi||)
nīḍā yaṁḍā nŏkkaḍe ninubom̐ṭigi
āḍagurā mārumāḍa lāyanāyam̐ badarā

(||||)
tĕllani vĕllām̐ bāle tĕlisidi vavulerā
gŏlla demaḍāya nām̐ḍugula mĕllānu
sallalammam̐ bonīrā sārĕ nannum̐ baṭṭagurā
salluvalabulu paibaim̐ jappanāyam̐ badarā

(||||)
kannade kaṁṭi guruma kaṁṭivi nīvavulerā
anniḍā nī kām̐ḍum̐boḍi agguvā yanu
nannu niṁṭi kem̐ganīrā navvulĕllam̐ jālum̐jālu
vĕnna nunnagā nūride vesaḍāyam̐ badarā

(||||)
paṭṭinade paṁtamāyam̐ bai kŏṁṭi vavulerā
kaṭṭinagaṁkaṇamāyam̐ gāṁtalĕllānu
iṭṭĕ śhrī veṁkaḍeśha iravai kūḍidi nannu
daṭṭamainadamagame tagulāyam̐ badarā