Needa sooda nimkanele nemdu mammaduganele

నీడ చూడ నిఁకనేలే నేఁడు మమ్మడుగనేలే
Language

(॥పల్లవి॥)
నీడ చూడ నిఁకనేలే నేఁడు మమ్మడుగనేలే
జోడగు మీ కూటమలు చూడఁజూడఁ గొత్తలు

(॥నీడ॥)
చెలువపు వలపుల చెమట ముత్యములె
చెలి నీచెక్కుల కివి సింగారమే
మలసేటి పులకలమల్లెలమొగ్గలు నేఁడు
బలువుఁ గుచములకు బంగారమే

(॥నీడ॥)
అసురుసురున వీడినట్టి నెరిఁదుమ్మిదలు
పసగ నీవెనువెంటఁ బరివారమే
రసికపుఁ బతితోడ రతివేళమాఁటలెల్లా
కసుగాటునీ మోవికిఁ గైవారమే

(॥నీడ॥)
పొందేటియలపు దేర పూఁటపూఁట కిచ్చేటి
కందువనీమోవితేనె ఘనసారమే
యిందునె శ్రీవేంకటేశు నిటు గూడివుండిననీ
విందులవెరగు మంచివిచారమే

(||pallavi||)
nīḍa sūḍa nim̐kanele nem̐ḍu mammaḍuganele
joḍagu mī kūḍamalu sūḍam̐jūḍam̐ gŏttalu

(||nīḍa||)
sĕluvabu valabula sĕmaḍa mutyamulĕ
sĕli nīsĕkkula kivi siṁgārame
malaseḍi pulagalamallĕlamŏggalu nem̐ḍu
baluvum̐ gusamulagu baṁgārame

(||nīḍa||)
asurusuruna vīḍinaṭṭi nĕrim̐dummidalu
pasaga nīvĕnuvĕṁṭam̐ barivārame
rasigabum̐ badidoḍa radiveḽamām̐ṭalĕllā
kasugāḍunī movigim̐ gaivārame

(||nīḍa||)
pŏṁdeḍiyalabu dera pūm̐ṭabūm̐ṭa kichcheḍi
kaṁduvanīmovidenĕ ghanasārame
yiṁdunĕ śhrīveṁkaḍeśhu niḍu gūḍivuṁḍinanī
viṁdulavĕragu maṁchivisārame