Needa mumchu paala mumchu neesittamu | neegum

నీట ముంచు పాల ముంచు నీచిత్తము । నీకుఁ
Language

(॥పల్లవి॥)
నీట ముంచు పాల ముంచు నీచిత్తము । నీకుఁ
జాటితి నింతేసి దూరజాలఁబో నే నిఁకను

(॥నీట॥)
యెక్కువతలఁపు నీపై నేపొద్దు నాకైతే-
నెక్కడెక్కడో నీయెన్నికలు
వెక్కసాన సారెసారె విన్నవించలేను నీ-
కెక్కినది నాజన్మ మింతేపో యిఁకను

(॥నీట॥)
నీపేరు చెవులవినేయాసే నాకైతేఁ
బైపూతలేపో నీభావములు
యేపున మొకమోట మేమియు నిన్ననలేను
పాపపుణ్యము నీపాలిదేపో యిఁకను

(॥నీట॥)
మన్నన నీకాఁగిటిలో మరపులే నాకైతేఁ
బన్ని మరురేకలే నీపనులెల్లను
యెన్నిక శ్రీవేంకటేశ యిపుడు నేఁ గోరినట్టి -
వన్నియు నాయ నమ్మికాయఁబో నా కిఁకను

(||pallavi||)
nīḍa muṁchu pāla muṁchu nīsittamu | nīgum̐
jāḍidi niṁtesi dūrajālam̐bo ne nim̐kanu

(||nīḍa||)
yĕkkuvadalam̐pu nībai nebŏddu nāgaide-
nĕkkaḍĕkkaḍo nīyĕnnigalu
vĕkkasāna sārĕsārĕ vinnaviṁchalenu nī-
kĕkkinadi nājanma miṁtebo yim̐kanu

(||nīḍa||)
nīberu sĕvulavineyāse nāgaidem̐
baibūdalebo nībhāvamulu
yebuna mŏgamoḍa memiyu ninnanalenu
pābabuṇyamu nībālidebo yim̐kanu

(||nīḍa||)
mannana nīgām̐giḍilo marabule nāgaidem̐
banni maruregale nībanulĕllanu
yĕnniga śhrīveṁkaḍeśha yibuḍu nem̐ gorinaṭṭi -
vanniyu nāya nammigāyam̐bo nā kim̐kanu