నీపని నీ వెరుఁగుదు నేనూఁ గొంత యెరుఁగుదు
(॥పల్లవి॥)
నీపని నీ వెరుఁగుదు నేనూఁ గొంత యెరుఁగుదు
పైపై నిన్ను గరిసించే పజలే పో జాణలు
(॥నీవ॥)
ఆవేళ నాపెచెవిలో నాడితివి యేకతాలు
నావంక చూచి నీవు నవ్వితివి
వేవేలుగా నీకు నేను వేలనే మొక్కుమొక్కితి
భావించుకో నేరిచినపజలే పో జాణలు
(॥నీవ॥)
సంగడిఁ గూచుండితిరి సన్నలు సేసుకొంటిరి
రంగుగా నాడకు యిట్టె రమ్మంటిరి
యింగిత మెరిఁగి నీకు నిచ్చితి కానుక పెక్కు
బంగులఁ దలఁచుకొనేపజలే పో జాణలు
(॥నీవ॥)
మోములో మీలోఁ జూచుక మోనముననే వుండి
నామీఁదఁ జెయివేసి నమ్మించితివి
ఆముక శ్రీ వేంకటేశ అందుకే నిన్నుఁ గూడితి
బాముతో విచ్చిచెప్పినపజలే పో జాణలు
(||pallavi||)
nībani nī vĕrum̐gudu nenūm̐ gŏṁta yĕrum̐gudu
paibai ninnu garisiṁche pajale po jāṇalu
(||nīva||)
āveḽa nābĕsĕvilo nāḍidivi yegadālu
nāvaṁka sūsi nīvu navvidivi
vevelugā nīgu nenu velane mŏkkumŏkkidi
bhāviṁchugo nerisinabajale po jāṇalu
(||nīva||)
saṁgaḍim̐ gūsuṁḍidiri sannalu sesugŏṁṭiri
raṁgugā nāḍagu yiṭṭĕ rammaṁṭiri
yiṁgida mĕrim̐gi nīgu nichchidi kānuga pĕkku
baṁgulam̐ dalam̐sugŏnebajale po jāṇalu
(||nīva||)
momulo mīlom̐ jūsuga monamunane vuṁḍi
nāmīm̐dam̐ jĕyivesi nammiṁchidivi
āmuga śhrī veṁkaḍeśha aṁduge ninnum̐ gūḍidi
bāmudo vichchisĕppinabajale po jāṇalu