Neebaalivaaramu ne metlunnaa

నీపాలివారము నే మెట్లున్నా
Language

(॥పల్లవి॥)
నీపాలివారము నే మెట్లున్నా
చేపట్టితి విఁకఁ జేరినా మేలే

(॥నీపా॥)
నిను నేఁ దడవను నీ కెదురాడను
నను నిఁక నేమన్నా మేలే
మునుపనె మొక్కితి మోహానఁ జిక్కితి
చెనకి నీ వెట్లఁజేసినా మేలే

(॥నీపా॥)
జగడించను బొమ్మజంకెన చూపను
వెగటున నను నవ్విన మేలే
తగిలితి వెంటనె దగ్గరి పిలిచితి
యెగసక్కెముతో నెట్టున్నా మేలే

(॥నీపా॥)
తలఁపున మఱవను తడఁబడి కొసరను
చెలఁగిటు గాఁగిలించిన మేలే
యిల నిను శ్రీ వేంకటేశ కూడితిని
మెలఁగి నీ వెట్లామెచ్చినా మేలే

(||pallavi||)
nībālivāramu ne mĕṭlunnā
sebaṭṭidi vim̐kam̐ jerinā mele

(||nībā||)
ninu nem̐ daḍavanu nī kĕdurāḍanu
nanu nim̐ka nemannā mele
munubanĕ mŏkkidi mohānam̐ jikkidi
sĕnagi nī vĕṭlam̐jesinā mele

(||nībā||)
jagaḍiṁchanu bŏmmajaṁkĕna sūbanu
vĕgaḍuna nanu navvina mele
tagilidi vĕṁṭanĕ daggari pilisidi
yĕgasakkĕmudo nĕṭṭunnā mele

(||nībā||)
talam̐puna maṟavanu taḍam̐baḍi kŏsaranu
sĕlam̐giḍu gām̐giliṁchina mele
yila ninu śhrī veṁkaḍeśha kūḍidini
mĕlam̐gi nī vĕṭlāmĕchchinā mele