నీపాలిటికి నాపె నిధియు నిధానము
(॥పల్లవి॥)
నీపాలిటికి నాపె నిధియు నిధానము
చేపట్టి నేఁ డింతగాఁగ సేవసేసె నీకును
(॥నీపా॥)
ఇంతేసి వెంగములాడ నెవ్వతైనా నేర్చునా
పంతమాడి నీకొంగు పట్టనేర్చునా
వంత నిన్ను వలపించి వంచుకొననేర్చునా
ఇంత సేసి యాపెగాఁగా నీడేరించె నిన్నును
(॥నీపా॥)
పచ్చిగా నిన్నెవతైనా భ్రమయించనేర్చునా
రచ్చవేసి ఇందరిలో రవ్వసేసునా
ముచ్చటాడి నీచేతుల మొక్కించుకోనేరుచునా
యెచ్చి యాపెగాఁగా యీడేరించె నిన్నును
(॥నీపా॥)
కలసి నిన్నెవ్వతైనా కళలురేఁచనోపునా
చలివాపి నవ్వింపించి జాణఁ జేసునా
యెలమి శ్రీవేంకటేశ ఇంతలోనే నిన్నుఁ గూడె
బలిమి ని న్నా పెగాఁగా పనిగొనె నిన్నును
(||pallavi||)
nībāliḍigi nābĕ nidhiyu nidhānamu
sebaṭṭi nem̐ ḍiṁtagām̐ga sevasesĕ nīgunu
(||nībā||)
iṁtesi vĕṁgamulāḍa nĕvvadainā nersunā
paṁtamāḍi nīgŏṁgu paṭṭanersunā
vaṁta ninnu valabiṁchi vaṁchugŏnanersunā
iṁta sesi yābĕgām̐gā nīḍeriṁchĕ ninnunu
(||nībā||)
pachchigā ninnĕvadainā bhramayiṁchanersunā
rachchavesi iṁdarilo ravvasesunā
muchchaḍāḍi nīsedula mŏkkiṁchugonerusunā
yĕchchi yābĕgām̐gā yīḍeriṁchĕ ninnunu
(||nībā||)
kalasi ninnĕvvadainā kaḽalurem̐sanobunā
salivābi navviṁpiṁchi jāṇam̐ jesunā
yĕlami śhrīveṁkaḍeśha iṁtalone ninnum̐ gūḍĕ
balimi ni nnā pĕgām̐gā panigŏnĕ ninnunu